మోటో తన కొత్త ఈ4 ప్లస్ స్మార్ట్ ఫోన్‌ను భారీ బ్యాటరీతో మార్కెట్లో దింపడానికి సిద్ధమైంది. 5,000 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఈ4 ప్లస్‌లో అందుబాటులోకి తెస్తామని మోటో ప్రకటించింది. ఇది ఇప్పటివరకూ మోటో స్మార్ట్ ఫోన్లలో వచ్చిన అతి పెద్ద బ్యాటరీ. ఇటీవలే ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) పరీక్ష పాసయిన ఈ4 తన భారీ బ్యాటరీతో యూజర్లను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
మోటోలో అన్ని ఫీచర్లు బాగున్నా, పెర్‌ఫార్మెన్స్ పరంగా బెటర్ గానే ఉన్నా బ్యాటరీ ప్యాకప్ విషయంలో మాత్రం మొదటి నుంచి వెనకబడే ఉంది. మోటో ఈ, మోటో జీ 4, జీ4 ప్లస్ ఇలా ఇంచుమించుగా అన్నింట్లోనూ బ్యాటరీ వీకే. దీన్ని అధిగమించి మార్కెట్లో నిలదొక్కుకోవడానికే మోటో ఈసారి ఏకంగా 5వేల ఎంఏహెచ్ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తుందని సమాచారం. మోటో ఈ4 ప్లస్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చినా, ఈ 4 మోడల్ మాత్రం 2,400 ఎంఏహెచ్ బ్యాటరీతోనే రానుంది. ఈ రెండు మోడళ్లు ఇప్పటికే మార్కెట్లో ఉన్న మోటో ఈ3, మోటో ఈ3 పవర్‌ను రీప్లేస్ చేయబోతున్నాయి. రానున్న ఒకటి రెండు నెలల్లో ఇవి ఇండియన్ మార్కెట్‌లోకి రానున్నాయి.
ఇప్పటికే ఉన్నాయి..
శామ్‌సంగ్ గెలాక్సీ ఏ 9 ప్రో, లెనోవో పీ2, ఆసస్ జెన్‌ఫోన్ 3ఎస్ మ్యాక్స్, ఆసస్ జెన్‌ఫోన్ 3ఎస్ మ్యాక్స్, ఆసస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ 2016 2జీబీ, ఆసస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ 2016 3జీబీ, జియోనీ మారథాన్ ప్లస్, జియోనీ మారథాన్ ఎం3తోపాటు జెడ్‌టీఈలు ఒకటి రెండు మోడళ్లు 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఇప్పటికే మార్కెట్లోకి వచ్చాయి. ఈ సెగ్మెంట్‌లో కొత్తగా అడుగు పెడుతున్న మోటో ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది బ్యాటరీ పనితీరుపైనే ఆధారపడి ఉంటుంది.