• తాజా వార్తలు

వ‌న్‌ప్ల‌స్ 8, వ‌న్‌ప్ల‌స్ 8 ప్రో ఈ రోజు నుంచే అమెజాన్‌లో అమ్మ‌కాలు

ఫ్లాగ్‌షిప్ ఫోన్స్‌లో స‌ప‌రేట్ ఫ్యాన్ బేస్ ఉన్న వ‌న్‌ప్ల‌స్ త‌న లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ వ‌న్‌ప్ల‌స్‌8, వ‌న్‌ప్ల‌స్ 8 ప్రోల‌ను ఇటీవ‌ల ఇండియాలో లాంచ్ చేసింది. ఈ రోజు నుంచి అమెజాన్‌లో అవి అమ్మ‌కానికి వ‌చ్చాయి. వాటి ఫీచ‌ర్లు, ప్ర‌త్యేక‌త‌లు ఏమిటో ఓ లుక్కేద్దాం

వ‌న్‌ప్ల‌స్ 8 
* 6.55 ఇంచెస్ క్యూహెచ్‌డీ ప్ల‌స్ ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌3 ప్రొటెక్ష‌న్‌
* ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్‌ప్రింట్ సెన్స‌ర్‌
* క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 865 ప్రాసెస‌ర్‌
* 6జీబీ/ 8జీబీ/ 12జీబీ ర్యామ్‌
* 128 జీబీ/ 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌
* ఆండ్రాయిడ్ 10 ఆక్సిజ‌న్ ఓఎస్‌

కెమె‌రాలు
వెనుక‌వైపు మూడు కెమెరాల సెట‌ప్ ఉంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్‌, 16 మెగాపిక్సెల్  అల్ట్రా వైడ్ కెమెరా  కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ‌

బ్యాట‌రీ
4300  ఎంఏహెచ్ బ్యాట‌రీ. 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌. 

ధ‌ర‌
వ‌న్‌ప్ల‌స్ 8 ధ‌ర 6జీబీ ర్యామ్ వేరియంట్ 41,999 రూపాయ‌లు. 8జీబీ ర్యామ్ వేరియంట్ 44,999. 12జీబీ వేరియంట్ 49,999 రూపాయ‌లు.

వ‌న్‌ప్ల‌స్ 8 ప్రో
* 6.78 ఇంచెస్ క్యూహెచ్‌డీ ప్ల‌స్ ఫ్లూయిడ్ అమోల్డ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌3 ప్రొటెక్ష‌న్‌
* ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్‌ప్రింట్ సెన్స‌ర్‌
* క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌
* 8జీబీ/ 12జీబీ ర్యామ్‌
* 128 జీబీ/ 256 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌
* ఆండ్రాయిడ్ 10 ఆక్సిజ‌న్ ఓఎస్‌

కెమె‌రాలు
వెనుక‌వైపు నాలుగు కెమ‌రాల సెట‌ప్ ఉంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌, 48 మెగాపిక్సెల్  అల్ట్రా వైడ్ కెమెరా, 5 ఎంపీ క‌ల‌ర్ ఫిల్ట‌ర్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ‌

బ్యాట‌రీ
4510 ఎంఏహెచ్ బ్యాట‌రీ. 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తోపాటు వైర్‌లెస్ ఛార్జింగ్ ఆప్ష‌న్ కూడా ఉంది. 

ధ‌ర‌
వ‌న్‌ప్ల‌స్ 8 ప్రో ధ‌ర 8జీబీ ర్యామ్ వేరియంట్ 54,999 రూపాయ‌లు. 12జీబీ వేరియంట్ 59,999 రూపాయ‌లు.

ఇవీ ప్రారంభ ఆఫ‌ర్లు
ప్రారంభ ఆఫ‌ర్‌గా ఎస్‌బీఐ కార్డ్‌తో వ‌న్‌ప్ల‌స్ 8, వ‌న్‌ప్ల‌స్ 8 ప్రో కొన్న‌వారికి 3వేల రూపాయ‌ల త‌గ్గింపు ల‌భిస్తుంది. అమెజాన్ పేతో చెల్లిస్తే 1000 రూపాయ‌ల క్యాష్‌బాక్ ఇస్తుంది.  జియో యూజ‌ర్ల‌కు 6వేల రూపాయ‌ల అద‌న‌పు బెనిఫిట్స్ ఉన్నాయి. మేజ‌ర్ బ్యాంక్ కార్డ్‌ల‌తో కొంటే 12 నెల‌ల నోకాస్ట్ ఈఎంఐ స‌దుపాయం కూడా పొంద‌వ‌చ్చు