• తాజా వార్తలు

రెడ్ మీ 6 అదుర్స్...


ఇండియాలో టాప్ సెల్లింగ్ర బ్రాండ్లలో ఒకటిగా ఉన్న షియోమీ నుంచి మరో కొత్త ఫోన్ రెడ్ మీ 6 లాంఛ్ అయింది. షియోమీ అభిమానులు కొద్దిరోజులుగా ఎదురుచూస్తున్న ఈ మోడల్ లాంఛ్ కావడంతో ధర, ఫీచర్సు వెల్లడయ్యాయి.
ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ స్మార్ట్‌ ఫోన్ ఫోర్‌ సైడెడ్‌ క్వర్డ్‌ 3 డీ గ్లాసెస్‌తో బ్లూ వేరియంట్‌తోపాటు సిల్వర్‌ ఎడిషన్‌ లో కూడా లాంచ్‌ చేసింది. ఇప్పడిప్పుడే ట్రెండుగా మారుతున్న డ్యూయల్ కెమేరా ఫీచర్ ను ఇందులోనూ అందుబాటులోకి తెచ్చారు. రెండు రియర్ కెమెరాలతో స్మార్టుగా కనిపిస్తోంది. ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను ముందుభాగంలోనూ అమర్చింది. స్ప్లాష్ రెసిస్టెంట్‌ గా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కొత్త డివైస్‌లో ప్రపంచంలో అతి చిన్న 10 ఎన్‌ఎం ప్రాసెసర్‌ అమర్చినట్టు తెలిపింది. ఐ కేర్‌ డిస్ ప్లే ఇందులో ఉందని చెబుతునత్నారు. ధర ఇంకా తెలియనపపటికీ ఇది శాంసంగ్‌ గెలాక్సీ 8, ఐ ఫోన్‌ 7, ఎల్జీ జీ6 ల మార్కెట్ ను దెబ్బతీస్తుందని భావిస్తున్నారు.
కాగా దీని ఇంటర్నెట్ వేగం అందరినీ ఆకట్టుకుంటోంది. 600 ఎంబీపీఎస్ డౌన్లోడ్ వేగం, 100 ఎంబీపీఎస్ అప్ లోడ్ వేగం ఉంటుందని చెబుతున్నారు. ప్రారంభ ధర 2499 చైనా యువాన్లు ఉండడంతో మన కరెన్సీలో రూ.25 వేలు లేదా రూ.24 వేల ధర నుంచి ఈ ఫోన్లు అందుబాటులోకి తెస్తారని భావిస్తున్నారు.
అదిరే ఫీచర్స్...
* ఆండ్రాయిడ్‌ 6.0 మార్ష్ మాలో
* 5.15 అంగుళాల ఫుల్‌ హెచ్‌ డీ డిస్‌ప్లే
* స్నాప్ డ్రాగన్ 835 చిప్ సెట్
* 6 జీబీ ర్యామ్‌
* 64, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్స్..
* డ్యుయల్‌ కెమెరా, డ్యుయల్‌ స్పీకర్స్‌
* 3350ఏంఏహెచ్‌ బ్యాటరీ