• తాజా వార్తలు

రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ అమ్మ‌కాలు షురూ..

రెడ్‌మీ త‌న నోట్ సిరీస్‌లో భాగంగా తీసుకొచ్చిన లేటెస్ట్ మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 9 ప్రో అమ్మ‌కాల‌ను ఈ రోజు నుంచే ప్రారంభించింది. ఎంఐ.కామ్‌, అమెజాన్‌ల్లో ఈ ఫోన్ అమ్మ‌కాలు ఈ రోజు మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌య్యాయి. 

రెడ్‌మీ నోట్ 9 ప్రో మ్యాక్స్   ఫీచ‌ర్లు
* 6.67 ఇంచెస్ డిస్‌ప్లే
* స్నాప్‌డ్రాగ‌న్ 720 జీ చిప్‌సెట్ 
* 6జీబీ /8జీబీ ర్యామ్‌
* 64/ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్‌

కెమెరాలు
* 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతోపాటు క్వాడ్ కెమెరా సెట‌ప్ ఉంది. 8 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్స‌ర్‌, 5ఎంపీ మ్యాక్రో కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్స‌ర్ ఇచ్చింది. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 ఎంపీ కెమెరా ఉంది. 

బ్యాట‌రీ 
5,020 ఎంఏహెచ్ భారీ బ్యాట‌రీ ఇచ్చింది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచ‌ర్ ఉంది.   

ధ‌ర 
మొత్తం మూడు వేరియంట్లున్నాయి.

* 6జీబీ ర్యామ్/ 64 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర 16,999 రూపాయ‌లు

* 6జీబీ ర్యామ్/ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర 18,499 రూపాయ‌లు

* 8జీబీ ర్యామ్/ 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ మోడ‌ల్ ధ‌ర 19,999 రూపాయ‌లు