దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఎ సిరీస్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఎ20 పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యుయల్ రియర్ కెమెరాను. సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను పొందు పర్చింది. ఏ సిరీస్‌లో భాగంగా ఏ 50, ఏ 30, ఏ 20 లను రష్యా మార్కెట్‌లో తీసుకొచ్చింది శాంసంగ్. బ్లాక్ , బ్లూ కలర్స్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ లభ్యం కానుంది. భారత మార్కెట్‌లో ఏ 20 ఏప్రిల్ రెండవవారంలో ఆవిష్కరించనుందని సమాచారం.దీని ధర సుమారుగా రూ. 14,900 ఉంటుందని అంచనా..
ఎ 20 ఫీచర్‌లు
6.4 హెచ్‌డీ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 720x1560 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్,512జీబీ దాకా విస్తరించుకునే అవకాశం,13+5 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా,8ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ
ఇటీవల ఏ, ఎం సిరీస్‌లలో ఇటీవల గెలాక్సీ ఫోన్లను తీసుకొచ్చిన శాంసంగ్ వచ్చే నెలలో మరో శాంసంగ్ గెలాక్సీ బిగ్ ఈవెంట్ నిర్వహించనునుంది. ఏప్రిల్ 10న ఈ ఈవెంట్ జరగనుందంటూ శాంసంగ్ ట్వీట్ చేసింది. అయితే ఈవెంట్ కు సంబంధించిన అన్ని వివరాలను గోప్యంగా ఉంచింది. కాగా ఈ ఈవెంట్‌పై పరిశ్రమ వర్గాల్లో పలు అంచనాలు నెలకొన్నాయి.
ముఖ‍్యంగా ప్రీమియం మిడ్ రేంజ్‌లో పాప్ అప్ కెమెరాతో ఏ90ను గ్లోబల్ మార్కెట్లలో లాంచ్ చేయనుంది. బ్యాంకాక్, మైలాన్, సావోపోలోలో ఒకేసారి వీటిని లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. అలాగే గెలాక్సీ ఏ సిరీస్‌లో ఏ 20 స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుందని అంచనా. దీంతోపాటు ఏ40, ఏ 20ఈ లను కూడా తీసుకురానుందని సమాచారం ఇటీవల ఇండియన్ మార్కెట్లో ఏ 30, ఏ 50, ఏ 10 స్మార్ట్‌ఫోన్లను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.