• తాజా వార్తలు

2020లో రానున్న 5జీ ఫోన్ల వివ‌రాలు ఇవే

3జీ, 4జీలు అయిపోయాయ్ ఇప్పుడు రాబోయేదంతా 5జీ యుగ‌మే. దీనికి త‌గ్గ‌ట్టుగానే అన్ని సెల్‌ఫోన్ కంపెనీలు 5 జీ ఫోన్ల మీద దృష్టి పెడుతున్నాయి. రాబోయే ఫోన్ల‌ను 5జీ స‌పోర్ట్ చేసేలా త‌యారు చేస్తున్నాయి. షియోమి, రియ‌ల్ మి, శాంసంగ్‌, యాపిల్‌, వివో, హాన‌ర్ లాంటి ఫోన్ కంపెనీల‌న్నీ 5 జీ ఫోన్లు తేబోతున్నాయి. 2020లో రాబోతున్న అలాంటి 5జీ ఫోన్లు ఏంటో చూద్దామా..

రియ‌ల్‌మి ఎక్స్ 50
తాము 5జీ స్మార్ట్‌ఫోన్‌ను త్వ‌ర‌లో తీసుకొస్తున్న‌ట్లు రియ‌ల్‌మి ఇటీవ‌లే క‌న్ఫామ్ చేసింది. రియ‌ల్‌మి ఎక్స్‌50 మోడ‌ల్ ఫోన్‌ను 5జీ స‌పోర్టివ్‌గా రూపొందించారు. ఇది త్వ‌ర‌లోనే భార‌త్‌లో లాంఛ్ కాబోతోంది. ఈ రియ‌ల్‌మీ ఫోన్ డ్యుయ‌ల్ మోడ్ ఎన్ఎస్ఏ, ఎస్ఏ 5జీగా త‌యారైంది. 

షియోమి ఎంఐ 10 5జీ
5జీని స‌పోర్ట్ చేస్తున్న ఫోన్ల‌లో షియోమి ఎక్స్ 50 ఒక‌టి. త్వ‌ర‌లోనే ఈ వెర్స‌న్ ఫోన్ లాంఛ్ కాబోతోంది. దీనిలో స్నాప్‌డ్రాగ‌న్ 865 ప్రాసెస‌ర్ ఉంది. ఇటీవ‌ల హ‌వోయిలో జ‌రిగిన క్వాల్‌కామ్ స‌ద‌స్సులో షియోమి ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. షియోమి ఎంఐ 8, ఎంఐ 9 మోడ‌ల్స్ గురించి కూడా షియోమి అనౌన్స్ చేసింది. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ 5జీ ఫోన్లు అందుబాటులోకి రానున్నాయి. 

రెడ్‌మి కే30 ప్రొ 5జీ
రెడ్‌మి తొలిసారి 5జీ ఫోన్‌ను రోల్ ఔట్ చేసింది.2020 నాటికి రెడ్‌మి కే30 ప్రొ మోడ‌ల్ విత్ 5జీ అందుబాటులోకి రానుంది. ఇప్ప‌టికే  రెడ్‌మి  కే20 భార‌త్‌లో విజ‌య‌వంత‌మైన మోడల్‌గా ఉంది. క్వాల్‌కామ్ ఫ్లాగ్‌షిప్ చిప్‌, స్నాప్‌డ్రాగ‌న్ 865 ప్రాసెస‌ర్‌తో ఇది త‌యారైంది. రెడ్‌మి కే30 అమోలెడ్ డిస్‌ప్లేని ప‌పోర్ట్ చేస్తుంది. 

గ్యాలాక్సీ ఎస్‌11 ప్ల‌స్ 5జీ
శాంసంగ్ నుంచి వ‌చ్చిన 5జీ ఫోనే గ్యాల‌క్సీ ఎస్‌11 ప్ల‌స్. 2020లో లాంఛ్ కాబోతోంది. గ్యాలాక్సీ ఎస్‌11తో పాటు గ్యాలెక్సీ ఎస్‌11 ప్ల‌స్, ఎస్ 11 ఇ,  ఈ ఫీచ‌ర్ అందుబాటులో రానుంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఈ కొత్త ఫీచ‌ర్ ఫోన్ల‌ను విడుద‌ల చేయ‌డానికి శాంసంగ్ ప్లాన్ చేస్తోంది. అయితే దీని డిజైన్‌, ధ‌ర‌, స్పెసిఫికేష‌న్ల వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

వీటిలో కూడా...

వ‌న్‌ప్ల‌స్ 8 ప్రొ

రియ‌ల్‌మి ఎక్స్ 3 ప్రొ

గూగుల్ పిక్స‌ల్ 5 

ఐఫోన్ 12 5జీ, ఐఫోన్ 12 ప్రొ 5జీ

వ‌న్‌ప్ల‌స్ 8 టీ, వ‌న్‌ప్ల‌స్ 8టీ ప్రొ 5జీ

శాంసంగ్ నోట్ 11 ప్లస్‌

నోకియా 5జీ 

మోట‌రోలా 5జీ

ఒప్పో రెనో 3