• తాజా వార్తలు

2020లో శాంసంగ్ తేనున్న కొత్త ఫోన్ల వివ‌రాల‌న్నీ ఒకేచోట మీకోసం

స్మార్ట్‌ఫోన్ అమ్మ‌కాల్లో శాంసంగ్ గ‌త సంవత్స‌రం వెనుక‌బడింది. రెడ్‌మీ, ఎంఐ, వివో వంటి ఫోన్లు మార్కెట్‌లో వాటాలు పెంచేసుకుంటున్నాయి. త‌క్కువ ధ‌ర‌ల‌కే మంచి ఫీచ‌ర్లు ఇస్తుండ‌టంతో వీటికి యూజ‌ర్ల‌లో మంచి హైప్ వ‌చ్చింది. అందుకే ద‌స‌రా సీజ‌న్‌లో శాంసంగ్ కూడా 45 మెగాపిక్సెల్ కెమెరాతో కూడిన శాంసంగ్ ఎం 30 ఎస్‌ను 14వేల‌కే అందుబాటులోకి తెచ్చింది. దీనికి యూజ‌ర్ల నుంచి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ ప‌రిస్థితుల్లో ఈ ఏడాది భారీగా కొత్త మోడ‌ల్ ఫోన్లు లాంచ్ చేయ‌డానికి శాంసంగ్ ప్లాన్స్ వేసుకుంది. ఈ ఏడాది శాంసంగ్ కొత్త‌గా తీసుకురానున్న మోడ‌ల్స్ ఇవీ..

శాంసంగ్ గెలాక్సీ నోట్ 10 లైట్‌
డిస్‌ప్లే:
6.7  అంగుళాల ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లే. ఫుల్ హెచ్‌డీ రిజ‌ల్యూష‌న్‌తో  బీజిల్‌లెస్‌గా వస్తోంది. 
చిప్‌సెట్‌:  శాంసంగ్ ఎక్సినోస్ 9820 ఎస్‌వోసీ 
ర్యామ్‌: 8 జీబీ 
ఇంట‌ర్న‌ల్ స్టోరేజి: 128 జీబీ 
కెమెరా: 48 ఎంపీ, 12 ఎంపీ వైడ్‌లెన్స్‌, 12 ఎంపీ టెలి ఫోటో లెన్స్‌తో ట్రిపుల్ కెమెరాలు 
బ్యాట‌రీ: 4,500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 45 వాట్స్ సూప‌ర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచ‌ర్‌

 

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 10 లైట్‌
డిస్‌ప్లే:
6.7  అంగుళాల ఇన్ఫినిటీ ఓ డిస్‌ప్లే. ఫుల్ హెచ్‌డీ రిజ‌ల్యూష‌న్‌తో  బీజిల్‌లెస్‌గా వస్తోంది. 
చిప్‌సెట్‌:  శాంసంగ్ ఎక్సినోస్ 8895 ఎస్‌వోసీ 
ర్యామ్‌: 6జీబీ/ 8 జీబీ 
ఇంట‌ర్న‌ల్ స్టోరేజి: 128 జీబీ 
కెమెరా: 48 ఎంపీ, రెండు  12 ఎంపీ లెన్స్‌ల‌తో ట్రిపుల్ కెమెరాలు 
బ్యాట‌రీ: 4,500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 45 వాట్స్ సూప‌ర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచ‌ర్‌

 

శాంసంగ్ గెలాక్సీ ఏ51 
డిస్‌ప్లే:
6.5  అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోల్డ్ డిస్‌ప్లే. ఇన్ఫినిటీ ఓ ప్యానెల్‌
చిప్‌సెట్‌:  శాంసంగ్ ఎక్సినోస్ 9611 ప్రాసెస‌ర్  
ర్యామ్‌: 6జీబీ 
ఇంట‌ర్న‌ల్ స్టోరేజి: 128 జీబీ 
కెమెరా:  వెనుక‌వైపు 48 ఎంపీతో కూడిన నాలుగు (క్వాడ్ ) కెమెరాల సెట‌ప్ , ఫ్రంట్ 32 ఎంపీ  సెల్ఫీ కెమెరా  
బ్యాట‌రీ: 4,000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచ‌ర్‌
ఇన్‌డిస్‌ప్లే ఫింగ‌ర్‌ప్రింట్ సెన్స‌ర్‌

 

శాంసంగ్ గెలాక్సీ ఏ71 
డిస్‌ప్లే:
6.7  అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోల్డ్ డిస్‌ప్లే. 
చిప్‌సెట్‌:  శాంసంగ్ ఎక్సినోస్ 9611 ప్రాసెస‌ర్  
ర్యామ్‌: 6జీబీ 
ఇంట‌ర్న‌ల్ స్టోరేజి: 128 జీబీ 
కెమెరా:  వెనుక‌వైపు 64 ఎంపీ లెన్స్‌తో కూడిన నాలుగు (క్వాడ్ ) కెమెరాల సెట‌ప్ , ఫ్రంట్ 32 ఎంపీ  సెల్ఫీ కెమెరా  
బ్యాట‌రీ: 4,500 ఎంఏహెచ్ బ్యాట‌రీ, 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచ‌ర్‌
ఇన్‌డిస్‌ప్లే ఫింగ‌ర్‌ప్రింట్ సెన్స‌ర్‌

వీటితోపాటు శాంసంగ్ గెలాక్సీ సిరీస్‌లో ఎస్‌11, ఎస్‌11 ప్ల‌స్ మోడ‌ల్స్‌ను కూడా ఈ ఏడాదే రంగంలోకి దింపనుంది. పంచ్  హోల్ షేప్‌లో ఉండే కెమ‌రా సెట‌ప్‌, ఎలాంటి నాచ్ లేని ఫుల్ స్క్రీన్ డిస్‌ప్లే,   హైఎండ్ ఎక్సినోస్ చిప్ సెట్‌తో ఈ కొత్త మోడ‌ల్ ఫోన్లు యూజ‌ర్ల‌కు హైఎండ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయ‌ని శాంసంగ్ చెబుతోంది.  

 

శాంసంగ్ గెలాక్సీ నోట్ 11 ప్ల‌స్ 
5జీ కంపాటబులిటితో రానుంది. గెలాక్సీ నోట్ 11, నోట్ ప్ల‌స్ అనే రెండు మోడ‌ల్స్‌ను తీసుకొస్తోంది. నాలుగు (క్వాడ్‌) లేదా ఐదు (పెంటా) కెమెరా సెట‌ప్ ఈ ఫోన్ల‌కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ అని శాంసంగ్ చెబుతోంది. ఫిబ్ర‌వ‌రిలో ఈ సిరీస్ ఫోన్ల‌ను రిలీజ్ చేయ‌బోతోంది. 

 

శాంసంగ్ రోల‌బుల్ ఫోన్ 
ఇక శాంసంగ్ ఈ ఏడాది టాప్ మోడ‌ల్‌గా రోల‌బుల్ ఫోన్‌ను తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ ఫోన్‌లో డిస్‌ప్లే ఫోల్డ్ అయి ఉంటుంది. మ‌నం కావాల్సిన‌న‌ప్పుడు డిస్‌ప్లే ప‌క్క‌నున్న బ‌ట‌న్ నొక్కి దాన్ని ఓపెన్ చేసి డిస్‌ప్లేను ఎక్స్‌పాండ్ చేసుకోవ‌చ్చు.  6 అంగుళాల డిస్‌ప్లే,  8 అంగుళాల స్క్రీన్‌గా మారుతుంది.  గెలాక్సీ ఫోన్‌ల్లో వాడిన మెటీరియ‌ల్‌తోనే దీన్ని కూడా రెడీ చేస్తున్నారు.