• తాజా వార్తలు

ఆకట్టుకునే ఫీచర్లతో హానర్ 20 సీరిస్ స్మార్ట్‌ఫోన్లు విడుదల 

చైనాకు చెందిన మొబైల్‌ తయారీ దిగ్గజం హానర్‌ 20 సిరీస్‌ ఫోన్లను లాంచ్‌ చేసింది. అమెరికాలో తీవ్రమైన ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత మార్కెట్‌లో తాజాగా ఈ స్మార్ట్‌ఫోన్లను  ఆవిష్కరించడం విశేషంగా చెప్పుకోవచ్చు. హానర్‌ 20, హానర్‌ 20 ప్రొ, హానర్‌ 20 ఐ పేర్లతో వీటిని ఇండియాలో లాంచ్‌ చేసింది.  క్వాడ్‌ కెమెరాతో హానర్ 20 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ అలాగే బడ్జెట్‌ ధరలో హానర్‌ 20ఐ ని లాంచ్‌ చేసింది. మూడు ఫోన్లకు 32ఎంపీ సామర్థ్యం  ఉన్న సెల్పీ కెమెరాలను అమర్చగా,  డిస్‌ప్లే, బ్యాటరీ సామర్థ్యం ఒ​కేలా ఉంచింది.  అయితే 20 ప్రొలో మాత్రం 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అమర్చింది. అలాగే 20ఐ  స్మార్ట్‌ఫోన్‌ను 24 +2+8 ఎంపీ ట్రిపుల్‌ కెమెరాలతో లాంచ్‌ చేసింది. ఫీచర్లను ఓ సారి పరిశీలిస్తే.

హాన‌ర్ 20 ఫీచ‌ర్లు 
6.1 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, హువావే కైరిన్ 980 ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 20, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ సిమ్, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3650 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్.

హానర్‌ 20 ప్రొ ఫీచర్లు 
6.26 ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 1080x2340 పిక్సెల్‌ రిజల్యూషన్‌ , 6/8జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌ , 7ఎన్‌ఎం కిరిన్‌ 980 ప్రాససర్‌, 48+16+2+ ఎంపీ రియర్‌ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీకెమెరా, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఇన్ డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి,ఫాస్ట్ చార్జింగ్.

హానర్ 20ఐ 
ఇందులో 6.21 అంగుళాల స్క్రీన్, కిరిన్ 710ఎఫ్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ, ట్రిపుల్ రియర్ కెమెరా (24 ఎంపీ+8 ఎంపీ+2 ఎంపీ), 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి. ఈ ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ 25 నుంచి అందుబాటులో ఉంటాయి.

ధరలు
హానర్ 20 ధర : రూ. 32,999. జూన్ 25 నుంచి అమ్మకాలు
హానర్ 20 ప్రొ : రూ. 39,999
హానర్ 20 ఐ : రూ. 14,999.  జూన్ 19 నుంచి అమ్మకాలు