• తాజా వార్తలు

ఐఫోన్ ల‌వ‌ర్స్‌కు మ‌రో షాక్‌..  ఐఫోన్ 12లో పెర‌గ‌నున్న  ధ‌ర‌

టెక్నాల‌జీ దిగ్గ‌జ కంపెనీ యాపిల్‌.. త‌న ప్రొడ‌క్ట్ ల‌వ‌ర్స్‌కు షాకుల మీద షాకులిస్తోంది.  ఇక‌పై రాబోయే ఐఫోన్ల‌కు ఛార్జింగ్ అడాప్ట‌ర్‌, ఇయ‌ర్ ఫోన్స్ ఇవ్వ‌బోమ‌ని లీకులిచ్చింది.  త్వ‌ర‌లో తీసుకురానున్న ఐఫోన్ 12 ధ‌ర కూడా పెంచే అవ‌కాశాలున్నాయ‌ని మ‌రో వార్త యాపిల్ ల‌వ‌ర్స్‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. 

క‌నీసం నాలుగు వేలు ఎక్కువే!
ఐఫోన్ 11 ప్రారంభ ధ‌ర 699 డాల‌ర్లు. కానీ ఐఫోన్ 12 ధ‌ర 749 డాల‌ర్లుగా ఉంటుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అంటే బేసిక్ మోడ‌ల్‌లోనే 50 డాల‌ర్లు అంటే దాదాపు 3,500 నుంచి 4వేల రూపాయ‌లు పెర‌గబోతోంది.

ఎందుకు? 
యాపిల్ త్వ‌ర‌లో రాబోయే ఐఫోన్ 12లో ఓలెడ్ స్క్రీన్ వాడుతుంద‌ట‌. అందువ‌ల్లే ధ‌ర పెరుగనుంద‌ని ఈ వార్త రాసిన వెబ్‌సైట్ చెబుతోంది. అయినా 60, 70 వేలు పెట్టి ఐఫోన్ కొనేవాళ్లు 3వేల ద‌గ్గ‌ర ఆగుతారా అని కూడా ముక్తాయించింది.