• తాజా వార్తలు

ఐఫోన్ ఎస్ఈ 2.0 వ‌చ్చేసింది.. ఒక చూపు ఇటు విస‌రండి

యాపిల్ ఎప్ప‌టి నుంచో త‌న వినియోగ‌దారుల‌ను ఊరిస్తున్న ఐఫోన్ ఎస్ఈ (2020)ని   విడుదల చేసింది.  ఐఫోన్ మోడ‌ల్స్‌లో ఎస్ఈకి చాలా ఫాన్ ఫాలోయింగ్ ఉంది.  ఫ‌ర్మ్ డిజైన్‌, సూప‌ర్ పెర్‌ఫార్మెన్స్ దీన్ని మార్కెట్‌లో ఓ రేంజ్‌లో నిలబెట్టాయి. ఇప్ప‌టికీ పాత ఐఫోన్ వాడుతున్న‌వారిలో ఐఫోన్ ఎస్ఈ ఎక్కువ‌మంది ద‌గ్గ‌రే క‌నిపిస్తుంది. ఐఫోన్ ఎస్ఈ 2.0 అన్న‌ట్లుగా కొత్త ఫీచ‌ర్ల‌తో లాంచ్ అయిన ఈ కొత్త ఐఫోన్ ఎస్ఈ 2 విశేషాలేంటో చూద్దాం రండి.  

ఐఫోన్ 8లా
* కొత్త ఐఫోన్ ఎస్ఈ డిజైన్‌ప‌రంగా  ఐఫోన్ 8ను పోలి ఉంది. 

*  దీనిలో ఫేస్ ఐడీకి బదులుగా టచ్ ఐడీ బటన్ అందించింది. ఐఫోన్ 8కు ముందు మోడ‌ల్స్‌లో మాత్ర‌మే ఉన్న ట‌చ్ ఐడీని అందించడం బాగున్నా ఫేస్ ఐడీని తీసేయ‌డం వెన‌క‌డుగే అని చెప్పాలి. 

* రెడ్‌, బ్లాక్‌, వైట్ క‌లర్ వేరియేష‌న్ల‌లో ఫోన్ రిలీజ‌యింది.

*4.7 అంగుళాల రెటీనా హెచ్‌డీ ఎల్సీడీ డిస్‌ప్లే 750x1334 పిక్సెల్స్  రిజల్యూషన్ 

* ఐఫోన్ 11లో వ‌చ్చిన ఏ13 బ‌యోనిక్ చిప్‌దీనిలోనూ ఉండ‌డం స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌

* వెనుక‌వైపు 12 మెగాపిక్సెల్ కెమెరా, 

* 7 ఎంపీ సెల్ఫీ కెమెరా

* 64, 128, 256 జీబీ ర్యామ్ వేరియంట్లున్నాయి. 

అదే స్ట్రాట‌జీ ఫాలో అవుతుందా?
ఇండియాలో ఈ ఫోన్ ఎప్పుడు రిలీజ‌వుతుందో తెలియ‌దు. కానీ ధ‌ర మాత్రం   రూ.42,500 (64 జీబీ ) నుంచి ప్రారంభం కానుంది. అదే అమెరికాలో 64 జీబీ మోడల్ ఐఫోన్ ఎస్ఈ ధర 399 డాలర్ల(సుమారు రూ.30,500). అంటే మ‌న‌కంటే అమెరికాలో 12వేలు త‌క్కువ‌.  128 జీబీ మోడల్ ధర అమెరికాలో 499 డాలర్లు (సుమారు రూ.34,400). ఇండియాలో రూ.47,800. 256 వేరియంట్ ధర 549 డాలర్లు(సుమారు రూ.45,000) ఇండియాలో రూ. 58,300.  ఐఫోన్ ధ‌ర‌లు చాలావ‌ర‌కు ఇండియా కంటే అమెరికాలో త‌క్కువ ఉంటాయి. ఇప్పుడూ అదే స్ట్రాటజీని ఫాలో అవుతోంది.