మోటరోలా నుంచి ఇండియా మార్కెట్లో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది. అదే.. మోటరోలా వన్ యాక్షన్ స్మార్ట్ ఫోన్. వీడియో కెమెరాపై ప్రత్యేక దృష్టిపెట్టిన మోటరోలా.. వన్ యాక్షన్ డివైజ్‌ను తీసుకుచ్చింది. మోటరోలా వన్ విజన్ మాదిరిగా ఇందులో ప్రత్యేకమైన ఫీచర్లు యూజర్లను ఆకర్షించేలా ఉన్నాయి. రూ.13,999 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 30వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో లభ్యం కానుంది. కాగా లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై పలు ఆఫర్లను అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను నో కాస్ట్ ఈఎంఐ పద్ధతిలోనూ కొనుగోలు చేయవచ్చు. యాక్సిస్ బ్యాంక్ కార్డులతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ.1వేయి వరకు డిస్కౌంట్‌ను అందిస్తారు. జియో వినియోగదారులకు రూ.2200 వరకు క్యాష్‌బ్యాక్, 125 జీబీ వరకు అదనపు డేటా లభిస్తుంది.
మోటోరోలా వన్ యాక్షన్ స్మార్ట్‌ఫోన్‌లో.. 6.3 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ ఎగ్జినోస్ 9609 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 16, 5 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.
స్పెషిఫికేషన్లు - ఫీచర్లు
6.3 అంగుళాలు డిస్‌ప్లే (2520x1080) 21:9 అస్పెక్ట్ రేషియో ,సెల్ఫీ కెమెరా పంచ్ హోల్ స్టయిల్, శాంసంగ్ Exynos 9609 ప్రాసెసర్, 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ, 10W ఫాస్ట్ ఛార్జింగ్, ఆండ్రాయిడ్ పై + ఆండ్రాయిడ్ 9, 16MP అల్ట్రా వైడ్ సెన్సార్, అల్ట్రా వైడ్ 117 డిగ్రీస్ వ్యూ ,12MP మెయిన్ కెమెరా, 5MP డెప్త్ సెన్సార్, డ్యుయల్ LED ఫ్లాష్, 12MP సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ
Flipkartలో ఆగస్టు 30, 2019 నుంచి ఎక్స్ క్లూజీవ్‌గా Motorola one action స్మార్ట్ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. విదేశీ మార్కెట్లలో ఇప్పటికే మోటరోలా వన్ యాక్షన్ రిలీజ్ అయింది. రానున్న రోజుల్లో ఆండ్రాయిడ్ అప్ డేట్స్ పొందవచ్చు. కాగా మోటరోలా వన్ యాక్షన్ కంటే ముందు ఇండియా మార్కెట్లో జూన్ నెలలో మోటరోలా వన్ విజన్ స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది. దీని ప్రారంభ ధర రూ.19వేల 999తో మార్కెట్లో లభ్యం అవుతోంది.