దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ ఫోల్డ్ ఫోన్ కు పోటీగా చైనా దిగ్గజం హువాయి మేట్ ఎక్స్ ను రంగంలోకి దించింది. తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మేట్ ఎక్స్‌ను స్పెయిన్ లోని బార్సిలోనాలో జరుగుతున్న మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (ఎండబ్ల్యూసీ) 2019 ప్రదర్శనలో లాంచ్ చేసింది. ఇందులో 6.6 ఇంచుల డిస్‌ప్లేను ముందు భాగంలో, 6.38 ఇంచుల డిస్ ప్లేను వెనుక భాగంలో అమర్చారు. ఈ రెండింటినీ మడత తీసినప్పుడు డిస్ ప్లే ఒకటే అవుతుంది. అప్పుడు ఆ డిస్‌ప్లే సైజ్ 8 ఇంచుల వరకు వస్తుంది. ఇలా ఈ ఫోన్ ను మడతబెట్టుకోవచ్చు.
హువాయి మేట్ ఎక్స్ ఫీచర్లు
6.6 ఇంచ్ ఓలెడ్ డిస్‌ప్లే, 2480 x 1148 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 6.38 ఇంచ్ సెకండరీ ఓలెడ్ డిస్‌ప్లే, 2480 x 892 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హువావే కైరిన్ 980 ప్రాసెసర్, 5జీ, 8జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఎన్ఎం కార్డ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 40, 16, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 55 వాట్ల సూపర్ చార్జ్.
హువాయి మేట్ ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఇంటర్‌స్టెల్లార్ బ్లూ కలర్ ఆప్షన్ లో విడుదల కాగా ఈ ఫోన్ ధరను 2607 డాలర్లు (దాదాపుగా రూ.1,85,220) గా నిర్ణయించారు. ఇక ఈ ఫోన్ జూన్ లేదా జూలై నెలలో వినియోగదారులకు మార్కెట్‌లో లభిస్తుంది.
5జీ ఫీచర్‌తో ఈ ఫోన్ దూసుకొచ్చింది. పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. వెనుక భాగంలో 40, 16, 8 మెగాపిక్సల్ కెమెరాలు మూడు ఉన్నాయి. మైక్రో ఎస్డీ కార్డుకు బదులుగా ఎన్ఎం కార్డు స్లాట్‌ను పొందుపరచం ద్వారా ఎన్ఎం కార్డును వేసుకుని స్టోరేజీని పెంచుకోవచ్చు. ఈ ఫోన్‌కు 55 వాట్ల సూపర్ చార్జ్ ఫీచర్‌ను కూడా అందిస్తున్నారు. ప్రపంచంలో ఈ ఫీచర్ తో వచ్చిన ఫోన్ ఇదే కావడం విశేషం. కాగా ఈ ఫోన్ లో ఉన్న 4500 ఎంఏహెచ్ బ్యాటరీ చార్జ్ 0 నుంచి 85 శాతం చార్జింగ్ అయ్యేందుకు కేవలం 30 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది.