• తాజా వార్తలు

రియల్‌మి నుంచి ఫస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌

బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ తయారీలో దూసుకుపోతున్న రియల్‌మి దిగ్గజాలతో పోటీపడేందుకు సిద్దమవుతోంది. కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్ లాంచ్ చేస్తూ జోరు మీదున్న ఈ కంపెనీ మరో అడుగు ముందుకు వేస్తూ 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకువచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్ సేత్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ట్విట్టర్ వేదికగా 5జీ స్మార్ట్‌ఫోన్ అంశాన్ని వెల్లడించారు.

5జీ ప్రొడక్టులను ఈ ఏడాదిలోనే  ఆవిష్కరించబోతున్నామని రియల్‌మి ఇండియా  సీఎండీ మాధవ్ సేథ్‌  ప్రకటించారు. స్కైలితో సమావేశం అనంతరం సేథ్‌  ఈ విషయాన్ని ప్రకటించారు. సాధ్యమైనంత  త్వరలో భారతదేశానికి  అత్యుత‍్తమ సాంకేతిక పరిజ్ఞానాన్నిఅందించబోతున్నామన్నారు.  చైనా, ఇండియాలోలో 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వచ్చిన నెలరోజుల్లోనే  తమ ఉత్పత్తులను ప్రవేశపెడతామని తెలిపింది. 

కంపెనీ 5జీ ఫీచర్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేస్తుందా? లేకపోతే రియల్‌మి ఎక్స్ స్మార్ట్‌ఫోన్‌లోనే 5జీ ఫీచర్‌తో కొత్త వేరియంట్ ఆవిష్కరిస్తుందా? అనే విషయంపై ఇంకా ఎటువంటి స్పష్టత లేదు. శాంసంగ్, మోటరోలా, హువాయి వంటి కంపెనీలు ఇప్పటికే 5జీ స్మార్ట్‌ఫోన్లపై పనిచేస్తున్న విషయం తెలిసిందే.  ఇప్పుడు రియల్‌మి వీటితో పోటీ పడనుంది. కంపెనీ ఈ ఏడాది చివరి కల్లా 5జీ ఫోన్‌ను ఆవిష్కరించే అవకాశముంది.

రియల్‌మి లేటెస్ట్‌గా రియల్‌మి  ఎక్స్‌ పేరుతో ఒక  స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసిన సంగతి తెలిసందే. 8జీబీ, 48ఎంపీ కెమెరా లాంటి ఫీచర్లతో చైనాలో లాంచ్‌ చేసింది. ఈ ఏడాది అర్థభాగానికి ఈ స్మార్ట్‌ఫోన్​ ఇండియన్‌ మార్కెట్లను పలకరించనుంది. ధర సుమారు.  రూ. 15400గా ఉంది.

రియ‌ల్‌మి ఎక్స్ ఫీచ‌ర్లు
6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2.2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్‌, డ్యుయ‌ల్ సిమ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.