• తాజా వార్తలు

ఇండియాలో విడుదలైన శాంసంగ్ గెలాక్సీ నోట్‌ 10, నోట్‌ 10 ప్లస్‌ : ఫోన్ల మొత్తం సమాచారం మీకోసం 

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ మేడిన్‌ఇండియా ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్లు   గెలాక్సీ  నోట్‌ 10, నోట్‌ 10 ప్లస్‌ లను భారత మార్కెట్లో లాంచ్‌  చేసింది. కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరలను వరుసగా రూ. 69,990, రూ.79,990గా నిర్ణయించింది. భారత్‌లో ఆరా బ్లాక్‌, ఆరా గ్లో, ఆరా వైట్ రంగుల్లో వీటిని విడుదల చేసింది. ఆగస్టు 22వరకు ప్రధాన రీటైల్‌ దుకాణాలు సహా ఈ-కామర్స్‌ సైట్లలో ఉచిత బుక్‌ సదుపాయం  అందుబాటులో ఉంటుంది. అయితే ఫోన్ల విక్రయాలు మాత్రం  ఆగస్టు 23 నుంచి ప్రారంభం అవుతాయి. 

శాంసంగ్ గెలాక్సీ నోట్ 10, నోట్ 10 ప్లస్ ఫీచర్లు...
6.8 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 3040 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ ,ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్/ఆక్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 9 సిరీస్ 9825 ప్రాసెసర్, 12జీబీ ర్యామ్, 256/512 జీబీ స్టోరేజ్, 1 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, సింగిల్/హైబ్రిడ్ డ్యుయల్ సిమ్,12, 12, 16 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, వీజీఏ డెప్త్ విజన్ కెమెరా ,10 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ,డాల్బీ అట్మోస్, యూఎస్‌బీ టైప్ సి ఆడియో ,అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, బారో మీటర్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, వైఫై 802.11 ఏఎక్స్, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి ,4300 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ల ఫాస్ట్ వైర్డ్ చార్జింగ్, వైర్‌లెస్ ఫాస్ట్ చార్జింగ్, వైర్‌లెస్ పవర్‌షేర్

గెలాక్సీ నోట్‌ 10 పూర్తి ఫీచర్లు
6.3 క్వాడ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, శాంసంగ్‌ ఎగ్సినోస్‌ 9825 ప్రాసెసర్‌, 10 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, 12+16+12 ఎంపీ వెనుక కెమెరా, పంచ్ హోల్ కెమెరా, 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 9 పై ఓఎస్‌, 1080x2280 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, డిస్‌ప్లేల కింద అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, యాంటీ స్పూఫింగ్ ఫీచర్‌, బ్లూటూత్‌ ఎస్ పెన్ స్టయిలస్‌, ఎస్ పెన్‌లో బిల్టిన్ లిథియం టైటానేట్ బ్యాటరీ, 3డీ రెండరింగ్ విత్ 3డీ స్కానింగ్, శాంసంగ్ బిక్స్‌బీ వాయిస్ అసిస్టెంట్, శాంసంగ్ హెల్త్, శాంసంగ్ పే, శాంసంగ్ డెక్స్, గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్‌, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్, ఫాస్ట్ చార్జింగ్, ఫాస్ట్ వైర్‌లెస్ చార్జింగ్ 2.0, వైర్‌లెస్ పవర్‌షేర్, క్యూఐ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్‌

ఫోన్ ఆఫర్లు
గెలాక్సీ నోట్ 10-సిరీస్ కొనుగోలుదారులు యూట్యూబ్ ప్రీమియం ఆరు నెలల సభ్యత్వాన్ని ఉచితంగా అందిస్తోంది. అలాగే ప్రీ-ఆర్డర్ చేసిన కొనుగోలుదారులు గెలాక్సీ వాచ్ యాక్టివ్‌ను దాని అసలు అమ్మకపు ధర రూ .19,990 కు బదులుగా రూ .9,999 తగ్గింపుతో పొందవచ్చు.  లేదా  గెలాక్సీ బడ్స్‌ను దాని అసలు ధర ట్యాగ్ 9,999 కు బదులుగా రూ .4,999 కు కొనుగోలు చేయవచ్చు. రీటైల్‌ దుకాణాలు, శాంసంగ్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ కార్డు ద్వారా ప్రీ బుక్‌ చేసుకొనే వారికి రూ.6 వేల వరకూ క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ రానుంది. మిగిలిన ఈ-కామర్స్‌ సైట్లలో ఐసీఐసీఐ బ్యాంకు కార్డులకు ఈ ఆఫర్‌ ఇస్తున్నట్లు శాంసంగ్‌ ఓ ప్రకటనలో తెలిపింది.  ఈ ఆఫర్లతో నో-కాస్ట్ ఇఎంఐ ఆఫర్‌ కూడా అందిస్తోంది.