• తాజా వార్తలు

యాపిల్‌, శాంసంగ్‌ల స్థాయిలో స్మార్ట్‌ఫోన్లు తెస్తున్న ఆండ్రాయిడ్ క్రియేట‌ర్

స్మార్ట్‌ఫోన్ల రేసులోకి మ‌రో కొత్త కంపెనీ వ‌చ్చేసింది. అది కూడా అల్లాట‌ప్పాగా కాదు.. ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ క్రియేట‌ర్ గా వ‌రల్డ్ ఫేమ‌స్ అయిన ఆండీ రూబిన్.. స్మార్ట్‌ఫోన్ల త‌యారీ రంగంలో కాలు పెట్టారు. గ్యాడ్జెట్ల‌ను కూడా తీసుకొస్తాన‌ని అనౌన్స్ చేశారు. యాపిల్‌, శాంసంగ్ ఫోన్లతో పోటీపడేలా స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తామ‌ని రూబిన్ చెప్పారు.
హై టెక్నాల‌జీ కెమెరాలు, సెన్స‌ర్లు..
ఆండీ రూబిన్ సొంత సంస్థ ‘ఎసెన్షియల్‌’లో త‌యారు చేసిన తొలి స్మార్ట్ ఫోన్‌ను త్వ‌ర‌లోనే రిలీజ్ చేయ‌బోతున్నారు. 360 డిగ్రీల కోణంలో వీడియో రికార్డ్ చేసే లేటెస్ట్ కెమెరాలు, సెన్స‌ర్లు ఈ ఫోన్ స్పెషాలిటీస్‌. ప్రస్తుతం అమెరికాలో ప్రీ ఆర్డర్లు తీసుకుంటున్న కంపెనీ ఎప్పుడు రిలీజ్ చేసేది రివీల్ చేయ‌లేదు. ధ‌ర 749 డాల‌ర్లు.
స్పెసిఫికేష‌న్స్‌
* 5.7 ఇంచెస్ హెచ్‌డీ డిస్‌ప్లే
* రెండు 13 మెగాపిక్సెల్‌ కెమెరాలు, 8 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా
* వీడియో రికార్డింగ్ కోసం డిటాచ‌బుల్ కెమెరా
* ఆక్టాకోర్ క్వాల్‌కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌
* 4జీబీ ర్యామ్‌
* 128 జీబీ ఇంట‌ర్న‌ల్ మెమ‌రీ
* 3,040 ఎంఏహెచ్ బ్యాటరీ