• తాజా వార్తలు

లాక్‌డౌన్‌లో మ‌నోళ్లు గూగుల్‌లో అత్య‌ధికంగా ఏం సెర్చ్ చేశారంటే..

కరోనా వైర‌స్ పుణ్య‌మాని ప్ర‌భుత్వం లాక్‌డౌన్ విధించ‌డంతో ఎప్పుడూ ప‌ట్టుమ‌ని ప‌ది గంట‌లు కూడా ఇంట్లో ఉండ‌నివాళ్లు కూడా నెల రోజులుగా గ‌డ‌ప దాట‌లేక‌పోయారు. ఖాళీగా ఉండి చేసే ప‌నేముంది క‌నుక అందరూ స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, కంప్యూట‌ర్లు, స్మార్ట్‌టీవీలు ఇలా అన్నింటిలోనూ ఇంట‌ర్నెట్‌ను ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. ఈ నెల రోజుల్లో మ‌న ఇండియ‌న్స్ గూగుల్‌లో అత్య‌ధికంగా సెర్చ్ చేసిన విష‌యాలేమిట‌నేది గూగుల్ సెర్చ్ ట్రెండ్ చూస్తే అర్థ‌మ‌వుతుంది.  విష‌య‌మేమిటంటే ఎక్కువ మంది నెట్‌లో కూడా క‌రోనా గురించే వెతికార‌ట‌.

టిప్స్ కోస‌మే
క‌రోనా వైర‌స్ టిప్స్ ఏమిటి అనేదాని గూగుల్‌లో క‌రోనా గురించి మ‌నోళ్లు అత్య‌ధికంగా వెతికిన  అంశం. దీన్ని దాదాపు కోటి మంది సెర్చ్ చేశార‌ని గూగుల్ ట్రెండ్స్ చెబుతోంది. దాని త‌ర్వాత స్థానం క‌రోనా వైర‌స్ హెల్ప‌ర్స్ గురించిన సెర్చ్‌ది. దీన్ని గూగుల్ చేసిన వాళ్లు 50 ల‌క్ష‌ల‌పైనే.

మందులు, వ్యాక్సిన్ గురించీ తెగ‌వెతికారు
బీసీజీ వ్యాక్సిన్ గురించి 1.2 ల‌క్ష‌ల సెర్చ్‌లు, ఇండియా నుంచి విదేశాలు పంప‌మని బ‌తిమాలిన హైడ్రాక్సీ క్లోరోక్విన్ గురించి 5 ల‌క్ష‌ల మంది సెర్చ్ చేశారు. ప్లాస్మా థెర‌పీ అంటే ఏమిట‌ని ల‌క్ష మంది వెతికారు.  చైనా క‌రోనా వైర‌స్ అని  20వేల మంది, ల‌క్ష‌ణాలు లేకుండానే వ్యాధి ఉండే  ఎసింప్ట‌మేటిక్ స్థితి గురించి మ‌రో 20 వేల మంది గూగుల్ చేశారు.  

ఆరోగ్య‌సేతు, కొవిడ్ ట్రాక‌ర్ల గురించి
ప్ర‌భుత్వం రూపొందించిన ఆరోగ్య సేతు యాప్ గురించి 3.2 ల‌క్ష‌ల మంది గూగుల్ చేశారు. దాన్ని డౌన్లోడ్ చేసుకోవ‌డం గురించి ల‌క్ష‌కు పైగా సెర్చ్‌లు వ‌చ్చాయి. కొవిడ్ 19 ట్రాక‌ర్ల గురించి కూడా నెట్‌లో చాలా మంది వెతికారు.

ఇవీ టాప్ టెన్‌
1) క‌రోనా వైర‌స్ హెల్ప‌ర్స్ -  50ల‌క్ష‌ల సెర్చ్‌లు

2) కొవిడ్‌19 - 7ల‌క్ష‌ల సెర్చ్‌లు

3) క‌రోనా వైర‌స్ -5 ల‌క్ష‌లు

4) లాక్‌డౌన్‌- 1 ల‌క్ష‌

5) లాక్‌డౌన్ ఎక్స్‌టెన్ష‌న్  -2 ల‌క్ష‌ల సెర్చ్‌లు

6) లాక్‌డౌన్ గైడ్‌లెన్స్ -  2ల‌క్ష‌ల సెర్చ్‌లు

7) ప్లాస్మా -  1 ల‌క్ష సెర్చ్‌లు

8) కొవిడ్ వారియ‌ర్స్ -  1 ల‌క్ష  సెర్చ్‌లు

9) ఈ-పాస్ ప‌ర్ లాక్‌డౌన్‌-  50,000  సెర్చ్‌లు

10) కంటెయిన్‌మెంట్ జోన్ -20,000 సెర్చ్‌లు

జన రంజకమైన వార్తలు