• తాజా వార్తలు

ఇండియాలో పబ్ జీ మళ్ళీ వస్తుందా..?!

మొబైల్ గేమ్స్ లో మోస్ట్ పాపులర్ అయిన పబ్ జీని మన ప్రభుత్వం నిషేదించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ గేమ్ మళ్ళీ ఇండియాలోకి రావడానికి రంగం సిద్దమైంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది పూర్తయ్యేలోపే పబ్ జీ రీఎంట్రీ ఖాయమని టెక్ సర్కిల్స్ చెబుతున్నాయి.   

 *డేటా మిస్ యూజ్ అవుతుందని బ్యాన్  
*చైనాతో సరిహద్దు తగవు ముదరడంతో భారత ప్రభుత్వం ఆ దేశపు ప్రొడక్ట్స్ మీద చాలా గట్టి ఆంక్షలు పెడుతోంది. అందులో భాగంగా మన యూజర్ల డాటాను మిస్ యూజ్ చేసే ప్రమాదం ఉందంటూ పబ్ జీని బాన్ చేసింది. చైనా కంపెనీ టెంసెంట్ హోల్డింగ్స్ పబ్ జీలో వాటా కలిగి ఉండడంతో మన యూజర్ల డేటా చైనా సర్వర్లలో స్టోర్ అవుతందని బ్యాన్ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి నాలుగు నెలలుగా ఇండియాలో పబ్ జీ బాన్ ఐపోయింది.కొంతమంది వీపీఎన్ ల ద్వారా యాక్సిస్ చేసి గేమ్ ఆడేవారు. సర్వర్లను టెంసెంట్ లిఫ్ట్ చేసేయడంతో ఇప్పుడు ఆలా ఆడే ఛాన్స్ కూడా కొత్తగా.  

           
 ఇప్పుడేంటి కొత్తగా?        
పబ్ జీ నుంచి టెంసెంట్ తప్పుకుందని దాని యాజయాన్యం ప్రకటించింది. అంతే కాదు ఇండియన్ యూజర్ల డాటాను ఇండియాలోనే సర్వర్లు పెట్టి స్టోర్ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇది ఓకే అయితే ప్రభుత్వానికి యూజర్ల సేఫ్టీ పరంగా ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. అదే జరిగితే ఇండియాలో పబ్ జీ రీఎంట్రీ ఖాయం అయినట్టే.

జన రంజకమైన వార్తలు