• తాజా వార్తలు

అటల్ పెన్షన్ యోజన - రూ.210 డిపాజిట్ చేయండి, నెలకు రూ.5 వేలు పొందండి 

కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతలో భాగంగా అటల్ పెన్షన్ యోజన పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ స్కీములో చేరడం వల్ల 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు పెన్షన్ తీసుకోవచ్చు. అయితే పెన్షన్ డబ్బులు మీరు ప్రతి నెలా చెల్లించే మొత్తం మీద ప్రాతిపదికన మారుతూ ఉంటుంది. ప్రాసెస్ ఓ సారి పరిశీలిస్తే..

అర్హతలు
అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో చేరాలంటే భారతీయ పౌరులు అయి ఉండాలి. 
వయసు 18 నుంచి 40 ఏళ్లలోపు ఉండాలి. 
కనీసం 20 ఏళ్లపాటు చందా కొనసాగించాలి. 
ఆధార్‌లో లింకైన బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి. 
మొబైల్ నెంబర్ కూడా ఉండాలి. 

ఎలా చేరాలి
అన్ని బ్యాంకులు ఈ స్కీమ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. 
మీరు ఏ బ్యాంకుకు అయినా వెళ్లి అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) స్కీమ్‌లో చేరొచ్చు. 
మీరు పథకంలో చేరిన తర్వాత మీ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది. 

నెలకు ఎంత కట్టాలి
చేరాలనుకున్న వారు నెలకు చెల్లించాల్సిన చందా మొత్తం వయసు, పెన్షన్ మొత్తం ప్రాతిపదికన మారుతుంది. 
మీరు 18 ఏళ్ల వయసులో స్కీమ్‌లో చేరితే రూ.1,000 పెన్షన్ కోసం రూ.42 చెల్లించాలి.
అదే రూ.2,000 పెన్షన్‌కు రూ.84 చెల్లించాలి.
రూ.3,000 పెన్షన్‌కు రూ.126 చెల్లించాలి.
రూ.4,000 పెన్షన్‌కు రూ.168 చెల్లించాలి.
రూ.5,000 పెన్షన్‌కు రూ.210 కట్టాలి. 
అదే మీరు 39 ఏళ్ల వయసులో పథకంలో చేరితే రూ.1,000 పెన్షన్ కోసం రూ.264, రూ.5,000 పెన్షన్ కోసం రూ.1,318 చెల్లించాలి. 

తప్పనిసరిగా గుర్తించుకోవలసిన అంశాలు 
అటల్ పెన్షన్ యోజన డబ్బులు ప్రతి నెలా మీ అకౌంట్‌ నుంచి ఆటోమేటిక్‌గానే డెబిట్ అవుతాయి. కాబట్టి మీరు అకౌంట్‌లో సరిపడినంత డబ్బులు ఎప్పుడూ ఉండేలా చూసుకోవాలి.
మీరు ఎప్పుడైనా చెల్లింపులో విఫలమైతే పెనాల్టీలు ఉంటాయి. 6 నెలలపాటు చందా కట్టకపోతే అకౌంట్‌ను నిలిపివేస్తారు. 12 నెలలు చెల్లించకపోతే మీ అకౌంట్ క్లోజ్ చేసి కట్టిన డబ్బులు వెనక్కు ఇచ్చేస్తారు. 
మీరు చెల్లించిన డబ్బులను ముందుగా వెనక్కు తీసుకోవడం కుదరదు. సబ్‌స్క్రైబర్ మరణిస్తే డబ్బులు నామినీకి ఇస్తారు. 
మీరు 60 ఏళ్ల వయసుకు ముందుగానే అకౌంట్ క్లోజ్ చేయాలని భావిస్తే మీరు చెల్లించిన మొత్తం, వడ్డీ ఇస్తారు. కాగా కేంద్ర ప్రభుత్వం మీ తరపున చెల్లించే మొత్తం తిరిగి ఇవ్వరు.

జన రంజకమైన వార్తలు