• తాజా వార్తలు

ఈ మ‌ధ్య ట్ర‌యిన్ ఎక్కారా? అయితే ఈ టెక్ మార్పుల్ని గ‌మ‌నించారా?

భార‌త్‌లో ఎక్కువ‌మంది ఉప‌యోగించే ప్ర‌యాణ సాధ‌నాల్లో రైలు ఒక‌టి. ట్ర‌యిన్స్‌లో జ‌నాల ర‌ష్ బ‌య‌ట‌ప‌డ‌టానికి మ‌నం ముందుగానే టిక్కెట్ చేసుకుంటాం. ఇలా ర‌ష్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి బుకింగ్ ఒక్క‌టే మార్గం. కానీ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నా కూడా టిక్క‌ట్ దొర‌క‌డం కూడా క‌ష్టమైపోతుందిప్పుడు. ఇందుకోసం రైల్వే శాఖ కొత్త మార్గాన్ని చూపించింది. ప్ర‌యాణీకులు సుల‌భంగా టిక్కెట్ బుక్ చేసుకుని జ‌ర్నీని ఆస్వాదించ‌డానికి ఒక ప్రాసెస్ ప్ర‌వేశ‌పెట్టింది మ‌రి అదేంటో చూద్దాం..

రిజ‌ర్వేష‌న్ చార్టులు
ఎయిర్‌లైన్స్ మాదిరిగానే రైల్వేస్ కూడా ప‌బ్లిక్ కోసం రిజ‌ర్వేష‌న్ చార్టులు పెట్ట‌నుంది. ఈ రిజ‌ర్వేష‌న్ చార్టుల ఆధారంగా ప్ర‌యాణీకులు త‌మ సీటింగ్ అరేంజ్‌మెంట్స్ చూసుకోవ‌చ్చు. త‌మ‌కు న‌చ్చిన సీట్ల‌ను ఎంచుకోవ‌చ్చు. దీని వ‌ల్ల ప్ర‌యాణీకుల‌కు త‌మ‌కు న‌చ్చిన సీట్ల‌ను ఎంచుకుని రిజ‌ర్వ్ చేసుకునే అవ‌కాశం ఉంది. ట్ర‌యిన్ బ‌య‌లుదేరే నాలుగు గంట‌ల ముందు ఈ చార్ట్ అందుబాటులో ఉంచుతారు.  ఆ త‌ర్వాత ట్ర‌యిల్ బ‌య‌లుదేరే 30 నిమిషాల ముందు కూడా ఒక చార్ట్‌ని ఉంచుతారు. దీనివ‌ల్ల మ‌న‌కు ఏ ట్ర‌యిన్‌లో సీటు ఉందో తెలిసిపోతుంది. ఒక‌ప్పుడు టీటీని బ‌తిమిలాడితే త‌ప్ప మ‌న‌కు సీటు దొరికేది కాదు.. కానీ దీని వ‌ల్ల ఆ సీటుని అప్ప‌టిక‌ప్పుడు రిజ‌ర్వ్ చేసుకోవ‌చ్చు. 

హ్యాండ్ హెల్డ్ టెర్మిన‌ల్‌
ఇండియ‌న్ రైల్వేస్ టెక్నాల‌జీని అందిపుచ్చుకుంటుంది. హ్యాండ్ హెల్డ్ టెర్మిన‌ల్స్ టెక్నాల‌జీని అందుబాటులోకి తెచ్చింది. రాజ‌ధాని, శ‌తాబ్ది ఎక్స్‌ప్రెస్‌ల‌లో ఈ టెక్నాల‌జీని టీటీల‌కు అందించారు. ఈ టెక్నాల‌జీ జీపీఎస్‌తో అనుసంధానం అయి ఉంటుంది.  ట్యాబ్ మాదిరిగా ఉండే ఈ డివైజ్ ద్వారా టీటీలు రియ‌ల్ టైమ్‌లో ట్ర‌యిన్ ఆక్యుపెన్సీ స్టేట‌స్‌ని అప్‌డేట్ చేయ‌చ్చు. అన్ రిజ‌ర్వేడ్ జ‌న‌ర‌ల్ కోచ్‌ల‌కు బ‌యోమెట్రిక్ లింక్ చేయాల‌ని నిర్ణ‌యించారు. దీని వ‌ల్ల పాసింజ‌ర్లు త‌ప్ప‌క టిక్కెట్ కొనాల్సి ఉంటుంది. 

జన రంజకమైన వార్తలు