• తాజా వార్తలు

ఆధార్ అప్‌డేట్ చేయ‌డానికి వ‌చ్చిన‌ కొత్త రూల్ మీకు తెలుసా?

ఆధార్‌.. భార‌త్‌లో ప్ర‌తి పౌరుడుకి ఎంతో అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్‌. ప్ర‌తి ప‌నిలోనూ ఇప్పుడు ఆధార్‌నే ప్రామాణికంగా తీసుకుటున్నారు. అయితే ఇంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్లో మ‌న స‌మాచారం క‌చ్చితంగా ఉండాలి. ఏదైనా త‌ప్పు ఉంటే చాలా క‌ష్టం. చాలామందికి ఇదే స‌మ‌స్య ఎదురువుతుంది. పేరు త‌ప్పు ప‌డ‌డ‌మో లేదా అడ్రెస్ మార్చుకోవాల్సి రావ‌డ‌మో..  ఫోన్ నంబ‌ర్ ఛేంజ్  చేయాల్సి వ‌స్తుంది. మ‌రి ఆధార్ అప్‌డేట్ చేయ‌డం ఎలా? .. ఆధార్ అప్‌డేష‌న్ చాలా ప్రాసెస్‌లా ఉంది. ఆఫ్‌లైన్ ద్వారానే మ‌నం వెళ్లి మార్చుకోవాల్సి వ‌స్తుంది. కానీ ఇప్పుడు ఈ తిప్ప‌లేమి లేకుండా ఆధార్‌లో అప్‌డేట్ కోసం ఒక నిబంధ‌న వ‌చ్చింది.. అదేంటో చూద్దామా..

డాక్యుమెంట్లు అక్క‌ర్లేదు
ఆధార్ అప్‌డేష‌న్‌లో ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం కోసం యూనిక్ ఐడింటిఫికేష‌న్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారికంగా ఒక ట్విట‌ర్ అకౌంట్‌ని తెరిచింది. ఆధార్‌లో అప్‌డేట్స్ ఎలా చేసుకోవాలో.. ఆధార్‌ని ఎలా ఉప‌యోగించుకోవాలి.. ఎలా జన‌రేట్ చేసుకోవాలి లాంటి ఇన్ఫ‌ర్మేటివ్ వీడియోల‌ను ఈ సంస్థ ట్విట‌ర్ ఖాతాలో పెట్టింది. ఇప్ప‌టికే ఈ అకౌంట్‌ని 240.3 వేల మంది ఫాలో అవుతున్నారు. ఈ అకౌంట్లోనే ఆధార్ అప్‌డేషన్ గురించి కొత్త నిబంధ‌న‌ల‌ను కూడా పెట్టారు. అదే నో డాక్యుమెంట్స్ నిబంధ‌న‌. దీని ప్ర‌కారం  ఆధార్  కార్డు ఉంటే చాలు.. నేరుగా అప్‌డేష‌న్ చేసుకోవ‌చ్చు. 

అప్‌డేట్ చేయాలంటే..
మీ డాక్యుమెంట్ల‌ను ఆధార్‌లో అప్‌డేట్ చేయాలంటే ఆధార్ సేవా కేంద్రానికి నేరుగా వెళ్లాల్సిన అవ‌స‌రం లేదు. ఆన్‌లైన్‌లోనే సగం ప‌ని చేసుకోవ‌చ్చు.  ముందుగా దీనిలో ఉండే అప్‌డేష‌న్ లింక్‌ను క్లిక్ చేసి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. ఆ త‌ర్వాత మీ పేరు మీద ఉన్న‌.. మీరు యూజ్ చేసి వేల్యుడ్ డాక్యుమెంట్ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత నేరుగా ఆధార్ కేంద్రానికి వెళ్లి ఆధార్‌ను తీసుకెళితే చాలు. వాళ్లు త‌ప్పును స‌రిదిద్దుతారు.

జన రంజకమైన వార్తలు