• తాజా వార్తలు

ఆన్ లైన్ కానున్న రైల్వే ట్రాక్ మానిటరింగ్ సిస్టం..

మన రైలు ప్రయాణాలను సురక్షితంగా ఉంచడానికి టెక్నాలజీని వాడుతున్న రైల్వేలు    

భారత రైల్వే లు ఉపయోగించు కుంటున్నట్లు గా సాంకేతిక పరిజ్ఞానాన్ని మరి ఏ ఇతర ప్రభుత్వ విభాగమూ ఉపయోగించుకోవడం లేదంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే మన  వెబ్ సైట్ లాంచ్ చేసిన తరవాత ఇప్పటివరకూ ఒక్క రైల్వే లకు సంబందించే పది వ్యాసాల దాకా ప్రచురించామంటే రైల్వే లు టెక్నాలజీ ని ఏ స్థాయి లో ఉపయోగిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నాం అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం .దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే లలో రైల్ ట్రాక్ మానిటరింగ్ సిస్టం ను ఆన్ లైన్ చేయబోతున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

సాంకేతిక పరిజ్ఞానం పై దృష్టి కేంద్రీకరించిన భారతీయ రైల్వే లు రైల్ టెంపరేచర్ ను నియంత్రణ లో ఉంచడానికీ , బ్రిడ్జి ల దగ్గర నీటి మట్టాన్ని మానిటర్ చేయడానికీ ఆన్ లైన్ విధానాన్ని దేశ వ్యాప్తం గా ఉపయోగించుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నది.ట్రాక్ మేనేజ్ మెంట్ సిస్టం TMS లో భాగం గా ఈ చర్యలు చేపట్టనున్నది.వెబ్ ఆధారిత ట్రాక్ మేనేజ్ మెంట్ సిస్టం అనేది దేం లోని అన్ని ప్రధాన రైల్వే డివిజన్ లలో ఇప్పటికే అమలులో ఉంది. రైల్వే ట్రాక్ ల యొక్క నిర్వహణ అనేది చాలా కీలకంగా మారనుంది. ప్రత్యేకించి ఎక్కువ వేగం తో నడిచే రైళ్ళను ప్రవేశ పెట్టబోతున్న సందర్భం లో రైల్వే  ట్రాక్ ల ఆధునికీకరణ తో పాటు వాటిని  సరైన పద్దతిలో నిర్వహించడం అనేది చాలా ముఖ్యమైన అంశం గా ఉన్నది. రానున్న రోజుల్లో రైల్ టెంపరేచర్ ను బ్రిడ్జి ల దగ్గర నీటి మట్టాన్నీ పర్యవేక్షించే టందుకు టెక్నాలజీ ని ఉపయోగించి మరిన్ని సరికొత్త పద్దతులు తీసుకు రానున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అంతేగాక ఈ TMS ను అమలు చేయడం ద్వారా రానున్న ఆరు నెలల్లో ఇన్స్పెక్షన్ రిజిస్టర్ అవసరం లేకుండా చేయబోతున్నామని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. అంటే అంతా ఆన్ లైన్ అవుతున్నపుడు ఇంకా ఇన్ స్పెక్షన్ రిజిస్టర్ తో పనేముంది. కాపలా లేని లెవెల్ క్రాసింగ్ లకు కూడా టెక్నాలజీ ని ఉపయోగించి పరిష్కారం చూపనున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ ప్రదేశాల లోనే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటన్నింటి కోసం కేటాయించిన బడ్జెట్ తో పాటు మరింత బడ్జెట్ ను కేంద్రం నుండి రైల్వే లు పొందనున్నట్లు సమాచారం.

 

జన రంజకమైన వార్తలు