దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ చైనాలోని తన మొబైల్, ఐటీ డిస్‌ప్లే తయారీ యూనిట్‌ను మూసివేయనుంది. ఇది భారత్‌కు లాబించబోతుంది. ఎందుకంటే ఈ యూనిట్‌ను భారత్‌లోని ఉత్తర్‌ప్రదేశ్‌కు తరలించనుంది. ఉత్తరప్రదేశ్‌లో ఈ డిస్‌ప్లే తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కంపెనీ ఏకంగా రూ. 4825 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైందని యూపీ ప్రభుత్వం ప్రకటించింది.
వేలల్లో ఉద్యోగవకాశాలు
శాంసంగ్ డిస్‌ప్లే సెంటర్‌ను యూపీలో పెట్టడం ద్వారా ఇక్కడ ప్రత్యక్షంగా 1500 మంది ఉపాధి పొందుతారు. పరోక్షంగా మరికొన్ని వేల ఉద్యోగాలు రానున్నాయి. శాంసంగ్ డిస్‌ప్లే యూనిట్ ఇప్పటివరకు రెండు దేశాల్లోనే ఉంది. మన దేశంలో పెట్టబోతున్నది మూడో యూనిట్.
కంపెనీకి భారీ ప్రోత్సాహకాలు
శాంసంగ్ కంపెనీ డిస్‌ప్లే తయారీ యూనిట్‌ను యూపీకి ఆకర్షించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించింది.
కంపెనీకి స్టాంప్ డ్యూటీ పై మినహాయింపు ఇచ్చింది. అంతేకాక ప్రొడక్ట్ లింక్డ్ ఇంటెన్సింటివ్స్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం కూడా చాలా రాయితీలను శాంసంగ్ కంపెనీకి కల్పించబోతున్నారు.