• తాజా వార్తలు

మన ఫోన్ స్క్రీన్ కరోనా వైరస్ ను వారం పాటు ఉంచగలదు.. పరిష్కారం ఇలా

టాయిలెట్ సీట్  కంటే మీ మొబైల్ స్క్రీన్ మీద 10 రెట్లు ఎక్కువ సూక్ష్మ క్రిములు దాగుంటాయని మీకు తెలుసా? ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మీ సెల్ ఫోన్ ద్వారా కుడా వ్యాపిస్తుందని మీరు నమ్మగలరా? మీ ఫోన్ పైకి చేరిన కరోనా వైరస్ దాదాపు వారం రోజులు అక్కడ బతికి ఉంటుందని అంటే మీరు నమ్మగలరా? ఇవన్నీ నిజాలే.  కరోనా  వైరస్ ఫోన్ ద్వారా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో తెలుసుకుందాం.                                                          

ఫోన్ క్లీన్ చేస్కుంటే మేలు                                             
స్మార్ట్  ఫోన్ యూజర్లు రోజూ సరాసరిన 5౦ సార్లయినా ఫోన్ టచ్ చేస్తారట. ఈ  సమయంలో దానిపై ఉండే  వైరస్ లు, బాక్టీరియాలు మన చేతి  ద్వారా మన లోపలికి ప్రవేశిస్తాయి. కరోనా వైరస్ వ్యాపిస్తున్న పరిస్థితుల్లో ఫోన్ ని కూడా క్లీన్ చేస్కోవడం తప్పనిసరి అని ప్రపంచ ఆరోగ్య  సంస్థ డబ్ల్యూహెచ్ వో హెచ్చరిస్తోంది.                                                                              

ఈ టిప్స్  ఫాలో అవ్వండి    
* ఫోన్‌ను  ఎలాపడితే అలా క్లీన్ చేస్తే పాడైపోతుంది కనుక దానికి కొన్ని టిప్స్ పాటించాలి అంటున్నారు నిపుణులు.          

* ముందుగా ఫోన్  స్విచ్ఆఫ్ చేయండి. ఆ తర్వాతే క్లీనింగ్ మొదలుపెట్టండి. .                                                            

*  ఐఫోన్ యూజర్స్  మన కళ్లద్దాలు తుడుచుకునే గుడ్డతో ఫోన్  క్లీన్ చేసుకోవచ్చని ఆపిల్ చెబుతోంది. ఐఫోన్ 7, ఆ తర్వాత వచ్చిన మోడల్స్  మరింత ఎక్కువ వాటర్ రెసిస్టెంట్ కలిగి ఉన్నాయి. కాబట్టి వాటిని క్లీన్ చేసేటప్పుడు గోరువెచ్చని సోప్ నీళ్లతో క్లీన్ చేయొచ్చు              

* అయితే  ఏ సెల్ క్లీనింగ్ చేసేటప్పుడైనా ఫోన్ లోపలికి నీళ్లు వెళ్ళే అవకాశమున్న భాగాల దగ్గర జాగ్రత్త పాటించాలి. స్పీకర్. మైక్, ఛార్జింగ్ పోర్ట్ వంటి వాటి దగ్గర పొడి బట్టతోనే తుడవాలి.                                                              

*లిక్విడ్స్ వాడి ఫోన్ క్లీన్ చేస్తే ఫింగర్ ప్రింట్ సెన్సార్ దెబ్బతింటుందని శాంసంగ్ యాపిల్ లాంటి కంపెనీలు హెచ్చరిస్తున్నాయి. కానీ కరోనా వైరస్ నేపధ్యంలో ఫోన్ క్లీనింగ్ తప్పదనుకుంటే చౌక రకం స్క్రీన్ గార్డ్ వేయించండి. దాన్ని వైప్స్ పెట్టి ఎప్పటికప్పుడు తుడుచుకోండి.                             

* చౌక రకం స్మార్ట్ ఫోన్ వాడుతుంటే అవి వాటర్ రెసిస్టెంట్ కాదు కాబట్టి శుభ్రమైన గుడ్డతో తుడవండి.

 

 

జన రంజకమైన వార్తలు