• తాజా వార్తలు

రూ.2,000, రూ.500, రూ.200 నోట్ల ప్రింటింగ్‌కు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా ?

ఇండియన్ క‌రెన్సీ నోట్ల‌లో ఏ నోటును ప్రింట్ చేయ‌డానికి ఎంత ఖ‌ర్చు అవుతుంది..? డిమానిటైజేషన్ తర్వాత వచ్చిన కొత్త రూ.2వేలు, రూ.500, రూ.200 నోట్లకు ప్రింటింగ్ ఖర్చు ఎంతవుతుంది అనే దానిపై చాలామంది గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. వీటి గురించి మీకు కొన్ని వివరాలను ఇస్తున్నాం. ఈ వివరాలతో మీరు ఖర్చు మీద ఓ అంచనాకు రావచ్చు.  

నోట్ల ముద్రణకు సంబంధించి ముఖ్యంగా రెండు విభాగాలు RBI ఆధ్వర్యంలో పనిచేస్తుంటాయి. అవి 1)భారత్ రిజర్వ్ భ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్, 2) ‘సెక్యురిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కాప్రోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.  ఎంతమేరకు కరెన్సీ అవసరం ఉంటుందో ఆమేరకు నిల్వలను ఉంచి RBI ఈ ముద్రణ కార్యక్రమానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.  అందులో భాగంగానే మింట్‌లు క‌రెన్సీ నోట్ల‌ను ప్రింట్ చేస్తాయి. అయితే అన్ని నోట్ల ప్రింటింగ్ ఖ‌ర్చు ఒకేలా ఉండ‌దు. వేర్వేరుగా ఉంటుంది.

కొత్త రూ.500 నోటు ప్రింటింగ్‌కు రూ.2.87 నుంచి రూ.3.09, కొత్త రూ.2000 నోటు ముద్రణకు రూ.3.54 నుంచి రూ.3.77 మేర ఖర్చవుతోందని 2017 సంవత్సరంలో కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రిగా పని చేసిన అర్జున్ రామ్ మేఘవాల్ ఓ ప్రశ్నకు సమాధానంగా రాజ్యసభకు ఆయన లిఖిత పూర్వంగా వివరించారు.  కొత్త రూ.500 నోటు ప్రింటింగ్‌కు రూ.2.87 నుంచి రూ.3.09, కొత్త రూ.2000 నోటు ముద్రణకు రూ.3.54 నుంచి రూ.3.77 మేర ఖర్చవుతోందని తెలిపారు. కొత్త నోట్ల ప్రింటింగ్ ఇంకా కొనసాగుతున్నందున మొత్తం ఖర్చు వివరాలు ప్రస్తుతం వెల్లడించడం సాధ్యం కాదన్నారు.

ఇప్పుడు రూ.2,000 నోటు ముద్రణకు అంతకుముందు ఏడాది కంటే 2018-19 ఆర్థిక సంవత్సరంలో 65 పైసలు లేదా 18.4 శాతం ఖర్చు తగ్గింది. 2017-18 ఆర్థిక సంవత్సరంలో రూ.2000 నోటు ముద్రణకు రూ.4.18 పైసలు ఖర్చు అయింది. గత ఏడాది నోటు ముద్రణ ఖర్చు తగ్గి, రూ.3.53గా ఉంది. ఈ మేరకు రాజ్యసభకు కేంద్ర ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. ఈ సమాచారం మేరకు... 2017-18లో రూ.500 నోటు ముద్రణకు రూ.2.39 పైసలు వ్యయం కాగా, 2018-19లో రూ.2.13 పైసలుగా ఉంది. రూ.200 నోటు ముద్రణ ఖరీదు 2017-18లో రూ.2.24 ఉండగా, 2018-19లో రూ.2.15కు తగ్గింది.

ఈ ఖర్చు యథాతథం ఈ గణాంకాలు BRBNMPL ముద్రించిన నోట్లకు సంబంధించినవి. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) కూడా కరెన్సీ నోట్లను ప్రింట్ చేస్తుంది. ఇది రూ.500, రూ.200 నోట్లను ప్రింట్ చేస్తుంది. ఇక్కడ రూ.500 నోట్ల ముద్రణకు రూ.3.375 వ్యయం అవుతోంది. గత ఏడాది కూడా ఇదే ఖర్చు అయింది. ఎలాంటి తేడా లేదు. రూ.200 నోటు ముద్రణకు 2018-19లో రూ.3.12గా ఉంది. 2017-18లోను ఇదే వ్యయం అయింది.

2016 కంటే 2017లో పెరిగిన ప్రింటింగ్ ఖర్చు 2017-18 (జూలై నుంచి జూన్)లో కరెన్సీ ప్రింటింగ్ ఖర్చు రూ.7,965 కోట్లు ఖర్చయింది. అంతకుముందు ఏడాది అంటే 2016-17లో ఈ కరెన్సీ నోట్లకు అయిన ఖర్చు రూ.4,912. 
 

జన రంజకమైన వార్తలు