• తాజా వార్తలు

రైల్వే యూజర్ల అలర్ట్ : ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించిన ఇండియన్ రైల్వే 

పర్యావరణంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్న ప్లాస్లిక్ వినియోగాన్ని నియంత్రించేందుకు ఇండియన్ రైల్వేస్ తగిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్లాస్టిక్‌ నిషేధించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు రైల్వే శాఖలో ప్లాస్టిక్‌ వాడాకాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్‌‌ 2 నుంచి ప్లాస్టిక్‌ సంచులను, ప్లాస్టిక్‌ పదార్థాల వాడకాన్ని ఆపాలని సిబ్బంది, రైల్వే పరిధిలోని వ్యాపారులకు చెప్పింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మెటీరియల్‌ను బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

అన్ని రైల్వే యూనిట్లలో 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్‌ను నిషేధించాలి. ప్లాస్టిక్‌ వ్యర్థాల ఉత్పత్తిని తగ్గించేందుకు, వాటిని పారేసేందుకు ఎకో ఫ్రెండ్లీ డిస్పోజల్‌ను ఏర్పాటు చేయాలి” అని రైల్వే శాఖ స్టేట్‌మెంట్‌రిలీజ్‌ చేసింది. ఎంప్లాయిస్‌ అందరూ రీయూజబుల్‌ బ్యాగ్స్‌ను ఉపయోగించాలని సూచించింది. త్వరలోనే ప్లాస్టిక్‌ వాటర్‌‌ బాటిల్స్‌ రిటర్న్‌ తీసుకునే పాలసీని ప్రవేశపెడతామని, బాటిల్‌ క్రషర్‌‌ మిషన్స్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

అలాగే ఇండియన్ రైల్వేస్ ప్లాస్టిక్ వినియోగంపై ఐఆర్‌సీటీసీకి కూడా అదేశాలు జారీ చేసింది. ట్రైన్ ప్యాసింజర్ల నుంచి, అలాగే బోగీల్లో పడిఉన్న వాటర్ బాటిళ్లను సేకరించి సుక్షితంగా డిస్పోజల్ చేయాలని ఐఆర్‌సీటీసీని కోరింది. ఇండియన్ రైల్వేస్ ప్లాస్టిక్ వినియోగంపై నిషేధానికి సంబంధించి ఇప్పటికే అన్ని జోన్లకు ఆదేశాలు జరీ చేసింది. సంస్థకు సంబంధించిన వెండర్లందరూ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్‌ వినియోగాన్ని నిలిపివేయనున్నారు. ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి ప్రభుత్వ రంగ సంస్థగా ఇండియన్ రైల్వేస్ నిలిచింది. 

అలాగే ప్లాస్టిక్ బాటిళ్లను నలిపివేయడానికి (క్రష్ చేయడానికి) వీలుగా ప్రధాన రైల్వే స్టేషన్లలో ప్లాస్టిక్ బాటిల్ క్రషింగ్ మెషీన్లను ఏర్పాటు చేయాలని ఐఆర్‌సీటీసీని ఇండియన్ రైల్వేస్ ఆదేశించింది. అంతేకాకుండా రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ ప్లాస్టిక్ బ్యాన్‌కు సంబంధించి అందరు జనరల్ మేనేజర్లు, డివిజనల్ రైల్వే మేనేజర్లకు వ్యక్తిగతంగా కూడా మెసేజ్‌లు పంపినట్లు తెలుస్తోంది. రైల్వే పరిసరాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని అందరూ కచ్చితంగా అమలు చేయాలని కోరారు.


 

జన రంజకమైన వార్తలు