• తాజా వార్తలు

టిక్‌టాక్ శాశ్వ‌తంగా బ్యాన్‌.. మ‌రో 58 చైనా యాప్స్ కూడా

స‌రిహ‌ద్దులో చైనా మ‌న మీద చేసే ప్ర‌తి దుందుడుకూ ప‌నికి చైనా యాప్స్ మీద దెబ్బ ప‌డిపోతోంది. ఇప్ప‌టికే వంద‌ల కొద్దీ యాప్స్‌ను బ్యాన్ చేసిన ప్ర‌భుత్వం తాజాగా అందులో 59 చైనా యాప్స్‌కి శాశ్వ‌తంగా మంగ‌ళం పాడేసింది. ఇందులో బీభ‌త్సంగా |ఫేమ‌స్ అయిన టిక్ టాక్ స‌హా మ‌రో 58 యాప్స్ ఉన్నాయి. 

వీచాట్‌, కామ్‌స్కాన‌ర్ కూడా..
టిక్‌టాక్, యూసీ  బ్రౌజ‌ర్‌, వీచాట్‌, బైడూ, కామ్‌స్కాన‌ర్‌, క్ల‌బ్ ఫ్యాక్ట‌రీ వంటి 59 యాప్స్‌ను ఇండియా లాస్ట్ జూన్‌లో బ్యాన్ చేసింది. వాటిని వాడే ఇండియ‌న్ల స‌మాచారానికి ఎలాంటి భద్ర‌తా ఉండ‌టం లేద‌ని, అవి మ‌న పౌరుల మీద చైనా వారికి నిఘా క‌ల్పిస్తున్నాయంటూ కంపెనీల‌కు నోటీసులిచ్చింది. అయితే ఆ కంపెనీలు స‌రిగా స్పందించ‌లేద‌ని ఇప్పుడు వాటిని శాశ్వ‌తంగా బ్యాన్ చేసేసింది.

టిక్‌టాక‌ర్లు ఇంక మ‌ర్చిపోవాల్సిందే
టిక్‌టాక్ ఇండియాలో పిచ్చ ఫేమ‌స్ అయింది. కోట్ల మంది దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్నారు. లాక్‌డౌన్‌లో ల‌క్ష‌ల గంట‌ల వీడియోలు చేసి వినోదం పంచారు. దాన్ని జూన్‌లో బ్యాన్ చేసింది ప్ర‌భుత్వం. అయితే ఇక్క‌డ కోట్ల రూపాయ‌ల ఆదాయం పొందుతున్న టిక్‌టాక్ యాజ‌మాన్యం బైట్ డ్యాన్స్ కంపెనీ ప్ర‌భుత్వం అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌రిగా స‌మాధానం చెప్పి ఉంటే ఈ యాప్ బ‌తికిబ‌ట్ట క‌ట్టేది. కంపెనీ స‌రిగా రెస్పాండ్ కాక‌పోవ‌డంతో ఇప్పుడు ప‌ర్మినెంట్‌గా బ్యాన్ అయిపోయంది. దీంతో  టిక్‌టాక్ ల‌వ‌ర్స్‌కు నిరాశే మిగ‌లింది. అలాగే కోట్ల మంది వాడుతున్న యూసీ బ్రౌజ‌ర్‌, కామ్‌స్కాన‌ర్‌, వీచాట్ వంటి యాప్స్ కూడా ఇక మ‌న‌కు ఇండియాలో ప‌ని చేయ‌వు. 
 

జన రంజకమైన వార్తలు