• తాజా వార్తలు

సెకనుకు 178 టీబీ స్పీడ్ తో ఇంటర్నెట్.. నిజమెంత?     

మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో  ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఎంతో పెరిగింది. ఒకప్పుడు ఫోన్లో ఓ ఫొటో డౌన్‌లోడ్‌ చేయాలన్నా బోల్డంత టైం పట్టేది. 3జీ, 4 జీ  వచ్చాక ఇప్పుడు 1 జీబీ ఫైలుని కూడా అలవోకగా డౌన్‌లోడ్ చేసుకోగలుగుతున్నాం. అయితే హెచ్‌డీ కంటెంట్‌ చూడాలంటే మాత్రం ఈ స్పీడ్ సరిపోదు. అందుకే  ఇంటర్నెట్‌ స్పీడ్‌ను పెంచేందుకు ఎప్పటికపుడు ప్రయోగాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో యూనివర్సిటీ కాలేజీ లండన్‌ రీసెర్చర్లు 178 టీబీపీఎస్ స్పీడ్ తో  ఇంటర్నెట్‌ను పరీక్షించారు. అంటే సెకనుకు లక్షా 78 వేల  జీబీలు అన్నమాట. ఈ  వేగంతో సుమారు 1500 4కే సినిమాలను  జస్ట్ ఒక్క సెకన్లో డౌన్‌లోడ్ చేయొచ్చు. నిజంగా అంత వేగంగా ఇంటర్నెట్ పనిచేస్తుందా లేదా అనేది ఈ విశ్లే|ష‌|ణ‌లో చూద్దాం.   

44 టీబీపీఎస్ రికార్డు 
గతంలో  ఆస్ట్రేలియా పరిశోధకులు  44.2 టీబీపీఎస్‌ వేగాన్ని అందుకుని  రికార్డు సృష్టించారు. ఇప్పటివరకు ప్రపంచంలో ఇదే అత్యధిక ఇంటర్నెట్ స్పీడ్. అయితే లేటెస్టుగా రాయల్‌ అకాడమీ రీసెర్చర్లు  ఆస్ట్రేలియా రికార్డును బ్రేక్‌ చేశారు. ఈ వేగాన్ని అందుకోవడానికి  సాధారణ ఫైబర్‌ ఆప్టిక్‌ కేబుల్‌కు బదులు.. హై ఫ్రీక్వెన్సీ బాండ్లను, సిగ్నల్‌ ఎక్సపాండ్ చేయడానికి లేటెస్ట్ యాంప్లిఫైయింగ్‌ టెక్నాలజీ, 16.8THz బ్యాండ్‌ విండ్త్‌ను వాడారు.   

నిజంగా అంత స్పీడ్ వస్తుందా?
మన దేశం‌లో ఇప్పుడు మొబైల్ ఇంటర్నెట్‌ స్పీడ్ సగటున  2ఎంబీపీఎస్‌. పోనీ బ్రాడ్‌బ్యాండ్ తీసుకున్నా జియో ఫైబ‌ర్ చెబుతున్న 100 ఎంబీపీఎస్సే ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధికం. వీటితో పోల్చుకుంటే 172 టీబీ ( టెరాబైట్స్) కొన్ని లక్షల రెట్లు అధికం. అయితే ఇది కేవలం ప్రయోగంగానే చూడాలంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇండియాలో 4జీ వ‌చ్చి చాలాకాల‌మైనా ఇప్ప‌టికీ దాని స్థాయి స్పీడ్ చాలా చోట్ల రావడం లేదు. హైదరాబాద్, బెంగళూర్ లాంటి మహా నగరాల్లో కూడా ఆ స్థాయి స్పీడ్ అందుకోలేకపోతున్నాం. ఎందుకంటే టెస్టింగ్ కండిష‌న్‌లో ఉన్న ఇంట‌ర్నెట్ స్పీడ్ నిజంగా మ‌నకు రావాలంటే మ‌న నెట్‌వ‌ర్క్‌, మ‌న డివైస్‌ల‌న్నీ ఆ స్థాయిలోనే ఉండాలి.  ఈ లెక్క‌న చెప్పొచ్చేదేమిటంటే  172 టీబీపీఎస్ స్పీడ్ అందుకోవడం ఇండియాలో దాదాపు అసాధ్యం !!!

జన రంజకమైన వార్తలు