• తాజా వార్తలు

ఈ దీపావ‌ళికి కొత్త ఫోన్ల కంటే కొంచెం పాత‌వే కొంటేనే మ‌న‌కు లాభం - ఒక విశ్లేషణ

దీపావ‌ళి రెండు రోజుల్లో వ‌చ్చేస్తుంది. దానికి వారం ప‌ది రోజుల ముందు నుంచే ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు, ఆఫ్‌లైన్‌లోని సెల్‌ఫోన్ల షాపులు కూడా బోల్డ‌న్ని ఆఫర్ల‌తో క‌స్ట‌మ‌ర్ల‌ను ఆకట్టుకోవాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాయి. అయితే ఇప్పుడు లేటెస్ట్ ఫోన్ల కంటే ఒక‌టి రెండు సంవ‌త్స‌రాల కింద‌ట వ‌చ్చిన ఫ్లాగ్‌షిప్ ఫోన్లు ఈ సేల్స్‌లో బాగా చౌక‌గా దొరుకుతున్నాయి. వాటిని కొంటేనే మ‌న‌కు లాభం అంటున్నారు నిపుణులు. అదేంటో అలాంటి ఫోన్లు ఏమున్నాయో ఓ లుక్కేద్దాం రండి..

ఐఫోన్ 7

ఐఫోన్ 11 64 జీబీ ఫోన్ 64,000 రూపాయ‌లు. అదే 2016లో రిలీజ‌యిన ఐ ఫోన్ 7 అయితే 27వేల‌కే ప్ర‌స్తుతం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్‌లో కూడా దొరికేస్తుంది. ఐ ఫోన్ 11లా దీనిలో డ్యూయ‌ల్ కెమెరా, డ్యూయ‌ల్ సిమ్ సెట‌ప్ లేదు కానీ పెర్‌ఫార్మెన్స్‌ప‌రంగా దానితో పోటీప‌డే ఫీచ‌ర్లు, ప‌నితీరు ఐ ఫోన్ 7 సొంతం.  ఐ ఫోన్ 11తో పోల్చితే స‌గం కంటే త‌క్కువ ధ‌ర‌కే ల‌బిస్తుంది కాబ‌ట్టి దీన్ని కొన‌డం మంచి బేర‌మ‌ని ఎక్స్‌ప‌ర్ట్‌ల మాట‌.  ఇలాగే ఆండ్రాయిడ్‌లో కూడా పాత ఫ్లాగ్‌షిప్ ఫోన్లు కొన‌డం మేలంటున్నారు.

శాంసంగ్ గెలాక్సీ ఎస్ 9

5.5 అంగుళాల సూప‌ర్ అమోల్డ్ క‌ర్వ్‌డ్ స్క్రీన్‌తో వ‌చ్చిన శాంసంగ్ గెలాక్సీ ఎస్ 9.. 70 వేల ధ‌ర‌కు లాంచ్ అయింది. ఇప్పుడు కొత్త ఫోన్ల తాకిడిలోనూ అమ్మ‌కాలు సాగించేందుకు భారీగా ధ‌ర త‌గ్గించారు. ఇప్పుడు ఈ ఫోన్ మీకు 29,999కే దొరుకుతుంది. ఇందులో ఉన్న‌ది 12 ఎంపీ కెమెరానే అయినా చాలా డెప్త్ ఇమేజ్‌ల‌ను తీయొచ్చు.  కొన్ని ఫీచ‌ర్లు త‌ప్ప లేటెస్ట్ ఎస్ 10తో ఇప్ప‌టికీ పోటీప‌డుతుంది.   వైర్‌లెస్ ఛార్జింగ్‌, డ‌స్ట్ వాట‌ర్ రెసిస్టెన్స్‌, స్టీరియో స్పీక‌ర్స్‌, డాల్బీ అట్మాస్ సౌండ్ ఎఫెక్ట్ వంటి ఫీచ‌ర్ల‌న్నీ ఉన్నాయి.  

ఎల్జీ జీ 7 థింక్యూ

ఇదే కోవ‌లో మ‌నం చెప్పుకోబోయే మ‌రో మంచి ఫోన్ ఎల్జీ జీ 7 థింక్యూ. అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌, 6.1 అంగుళాల రిచ్ క‌ల‌ర్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగ‌న్ 845 తో శ‌క్తిమంత‌మైన ప్రాసెస‌ర్‌, ఎక్స్‌ట్రా లౌడ్ బూమ్ స్ పీక‌ర్‌, స్లీక్ డిజైన్ దీని సొంతం.  ఒక‌ప్పుడు దాదాపు 50వేల ధ‌ర ఉన్న ఈ ఫోన్ ఇప్పుడు 22,990కే ల‌భిస్తోంది.

 కో ఎఫ్ 1

ఎంఐ నుంచి ఫ్లాగ్ షిప్ ఫోన్‌గా వ‌చ్చిన ఫోకో ఎఫ్ 1 కూడా ఇప్పుడు ధ‌ర త‌గ్గింది. స్నాప్‌డ్రాగ‌న్ 845 చిప్‌సెట్‌తో ఈ ఫోన్‌లోని  కెమెరా ఐ ఫోన్ 8 స్థాయిలో ఉంటుందని విశ్లేష‌కులు చెబుతున్నారు. 6జీబీ  ర్యామ్‌, 64 జీబీ రామ్‌, 20 ఎంపీ సెల్ఫీ కెమెరా, 12 ఎంపీ ప్ల‌స్ 5 ఎంపీ  రియ‌ర్ కెమెరాతో వ‌చ్చిన ఈ ఫోన్ ధ‌ర  ఫ్లిప్‌కార్ట్ లో ఇప్పుడు 14,999. 128 జీబీ  రామ్ వెర్ష‌న్ అయితే 15,999. దీనిమీద మ‌ళ్లీ ఎస్‌బీ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌తో 10% అద‌న‌పు డిస్కౌంట్ కూడా ల‌భిస్తుంది.

వివో నెక్స్‌

కెమెరా ఫోన్ల‌కు పేరెన్నిక‌గ‌న్న వివో నుంచి గ‌తేడాది వ‌చ్చిన వివో నెక్స్ కూడా ఇప్పుడు బాగా ధ‌ర త‌గ్గింది. 6.59 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్ డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌,  మంచి కెమెరాలు, 4,000 ఎంఏహెచ్ బ్యాట‌రీ దీనిలోని ఫీచ‌ర్లు. పాప్ అప్ కెమెరా ఫోన్ చుట్టూ తిర‌గ‌డం మ‌రో హైలైట్‌. చూడ్డానికి చాలా కాస్ట్‌లీగా కూడా క‌నిపించే ఈ ఫోన్ ధ‌ర ప్ర‌స్తుతం 27,999.

జన రంజకమైన వార్తలు