• తాజా వార్తలు

ట్విట్ట‌ర్ కూ టెక్నిక‌ల్ ప్రాబ్ల‌మ్‌.. హ్యాకైందేమోన‌ని యూజ‌ర్ల టెన్ష‌న్‌

కోట్ల మంది యూజ‌ర్లున్న మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ శుక్రవారం ఉదయం యూజ‌ర్ల‌ను కంగారు పెట్టింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా చాలా చోట్ల అర‌గంట‌కు పైగా మొరాయించింది. ట్విట్ట‌ర్ అకౌంట్లోకి లాగిన్ కావ‌డానికి అయ్యేందుకు ప్రయత్నించిన చాలామందికి టెక్నిక‌ల్ ఎర్ర‌ర్ అంటూ మెసేజ్ క‌నిపించ‌డంతో యూజ‌ర్లు కంగారుప‌డ్డారు. వెబ్‌సైట్‌, మొబైల్‌ యాప్‌ల్లోనూ ఇదే మెసేజ్‌ కనిపించింది. మొన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్విట్ట‌ర్ హ్యాక్ అవ‌డంతో త‌మ ట్విట్ట‌ర్ అకౌంట్లు కూడా హ్యాక్ అయ్యాయేమోన‌ని చాలా మంది యూజ‌ర్లు కంగారుప‌డ్డారు.
జ‌పాన్‌లో ఎక్కువ‌
డౌన్‌ డిటెక్టర్‌ అనే సంస్థ ఇన్ఫ‌ర్మేష‌న్ ప్రకారం జపాన్‌లో ట్విటర్‌ చాలా ఎక్కువగా మొరాయించింది. శుక్ర‌వారం ఉద‌యం 6 నుంచి 8 గంట‌ల మ‌ధ్య అమెరికా, యూకే , నెద‌ర్లాండ్స్‌, ఫ్రాన్స్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ సమస్య తలెత్తింది. ఇండియాలో బెంగళూరులో ట్విటర్‌ ఎక్కువగా ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్‌, ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్‌, చెన్నై ల్లోనూ చాలా మంది ట్విట్ట‌ర్ అకౌంట్ ఓపెన్‌ కాలేద‌ని చెప్పారు. కొందరికి ఈ సమస్య ఎదురైంది.
హ్యాక్ అయిందేమోన‌ని కంగారు
ర్యాన్స‌మ్‌వేర్ దాడులతో వణికిపోతున్న నెటిజన్లు.. ట్విటర్‌ మొరాయించడంతో ఇది కూడా వైర‌స్ ఎఫెక్టేనా అని టెన్ష‌న్‌ప‌డ్డారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ట్విట్ట‌ర్ అకౌంట్ మూడు రోజుల క్రితం హ్యాక్ అవ‌డంతో ఇప్పుడు త‌మ అకౌంట్ కూడా అలాగే అయిందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. అయితే 35 నిమిషాల్లోనే ట్విటర్‌ సేవలు తిరిగి మామూలు స్థితిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇంట‌ర్న‌ల్ స‌ర్వ‌ర్‌లో ఎర్ర‌ర్ వ‌ల్లే ట్విట్ట‌ర్ త‌ర‌చూ ఇలా మొరాయిస్తున్న‌ట్లు కంపెనీ చెబుతోంది.

జన రంజకమైన వార్తలు