మన దేశపు తొలి వైర్ లెస్ టెక్నాలజీ మొబైల్ నెట్వర్క్ 2జీకి కాలం చెల్లిపోయిందా? పరిస్థితులు చూస్తుంటే అదే అనిపిస్తుంది. సుమారు 25 సంవత్సరాల క్రితం నాటి 2జీ టెక్నాలజీకి కాలం చెల్లిపోయిందని, దాన్ని వదిలించుకునేందుకు విధానపరమైన చర్యలు అవసరమని రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ చెప్పడం చూస్తుంటే 2 జీకి రోజులు దగ్గరపడ్డట్లే కనిపిస్తుంది. ఎందుకంటే ? ప్రపంచం అంతా 5జీ టెక్నాలజీలోకి అడుగుపెట్టే ప్రయత్నం చేస్తుంటే ఇంకా మన దేశంలో 30 కోట్ల మంది 2జీ ఫీచర్ ఫోన్లే వాడుతున్నారు. అందువల్ల వారు మౌలిక ఇంటర్నెట్ సదుపాయం కూడా అందుకోలేకపోతున్నారని అంబాని చెబుతున్నారు . అంతే కాదు 2జీలో మొబైల్ సేవల ఖరీదు ఎక్కువ. ఇంటర్నెట్ సౌఖర్యం కూడా దొరకదు. 2 జీ నుంచి 3జీ, 4జీ మొబైల్ కాల్ చార్జీలు బాగా తగ్గిపోయాయి. 150 రూపాయల రీఛార్జి తో ఇప్పుడు వినియోగదారులు ఎలాంటి కాలపరిమితి లేకుండా ఉచితంగా కాల్ మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఇంటర్నెట్ అంబాటులోకి రావడంతో వార్తలు, వీడియోలు అన్నీ ఫోన్లోనే చూస్తున్నారు. ఆన్లైన్ బ్యాంకింగ్, ఈ కామర్స్ ట్రాన్సాక్షన్స్, పేటీఎం, ఫోన్ పే లాంటి వాటితో డిజిటల్ పేమెంట్ వంటివన్నీ ఫోన్లోనే చక్కబెట్టుకోగలుగుతున్నాం. ఇవన్నీ 2జీలో చేయలేనప్పుడు దాన్ని క్రమంగా వదిలించుకోవాలని అంబానీ సూచన.