2017 ఫస్ట్ క్వార్టర్లో ఇండియాలో స్మార్టు ఫోన్ల సేల్స్ 2.9 కోట్లకు దాటింది. ఇందులో అత్యధికంగా 4జీ సదుపాయం ఉన్నవే అమ్ముడు పోయాయి. 3జీ ఫోన్ల వైపు ఎవరూ కన్నెత్తి కూడా చూడడం లేదు. రిలయన్స్ జియో రాకతో దేశమంతా 4జీ.. 4జీ అంటూ కలవరిస్తోంది. ఇంటర్నెట్ సేవల్లో వేగం... ఇంతకాలం ఫ్రీగా.. ఇప్పుడు చౌకగా 4జీ ఇంటర్నెట్ దొరుకుతుండడంతో జియో కోసమే చాలామంది 4జీ మొబైల్స్ కొనుగోలు చేస్తున్నారు. ఈ ఏడాది ఇంతవరకు అమ్ముడుపోయిన స్మార్టు ఫోన్లలో 96 శాతం 4జీ ఫోన్లే.
2017 ఫస్ట్ క్వార్టర్ స్మార్టుఫోన్ షిప్ మెంట్ మార్కెట్ షేర్ ఇలా..
స్మార్టు ఫోన్ల సేల్స్
-------------------
కంపెనీ మార్కెట్ షేర్
----------
శాంసంగ్ 26
జియోమీ 13
వివో 12
ఒప్పో 10
లెనోవో 8
ఇతర అన్నీ 31
----------
ఇక ఫీచర్ ఫోన్లు అన్ని కలిపి చూసినా శాంసంగే టాప్ ప్లేస్ లోఉంది. అయితే.. రెండో స్థానం మాత్రం చైనీస్ కంపెనీ ఐటెల్ దక్కించుకుంది. ఐటెల్ కంపెనీయే టెక్నో పేరుతో స్మార్టు ఫోన్లు కూడా విక్రయిస్తుంది. ఆఫ్రికాలో మంచి మార్కెట్ ఉన్న ఐటెల్, టెక్నోల్లో ఐటెల్ ఇండియాలో గ్రిప్ పెంచుకుంటోంది.
2017 ఫస్ట్ క్వార్టర్ హ్యాండ్ సెట్ షిప్ మెంట్ మార్కెట్ షేర్ ఇలా..
అన్ని రకాల హ్యాండ్ సెట్లు కలిపి..
---------
కంపెనీ మార్కెట్ షేర్
----------
శాంసంగ్ 26 శాతం
ఐటెల్ 9
మైక్రోమ్యాక్స్ 8
జియోమీ 7
వివో 6
ఇతర అన్నీ 44