స్మార్ట్‌ఫోన్ ఉపయోగం
మొబైల్ ఫోన్.. ఇది మన జీవితంలో భాగమైపోయింది. మెలుకువ ఉన్నా.. నిద్రపోయినా ఎక్కడ ఉన్నా స్మార్ట్‌ఫోన్ మనతో పాటు ఉండాల్సిందే. అయితే స్మార్ట్‌ఫోన్ వినియోగం ఎక్కువైపోయి మనుషుల మధ్య సంబంధాలు దెబ్బ తింటున్నాయన్నది ఒప్పుకుని తీరాల్సిన నిజం. అంతేకాదు ఎక్కువ ఫోన్ వాడకం వల్ల నిద్ర తగ్గిపోవడం, అలసట, పనిలో నీరసం లాంటి అవలక్షణాలు స్మార్ట్‌ఫోన్ల వల్ మనకు కలిగే నష్టాలు. క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఇటీవల చేసిన ఒక సర్వేలో చాలా ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
18 నుంచి 83 ఏళ్ల వయసు గల వారిని సర్వే చేసిన క్వీన్స్‌లాండ్ యూనివర్సిటీ ఎక్కువమంది ఫోన్‌కు బానిసలుగా మారిపోయారని దీని వల్ల ప్రొడెక్టవిటీ తగ్గిపోయిందని ఈ సర్వేలో తేలింది. తమకు నిద్ర లేకపోవడానికి ఎక్కువమంది జనం ఫోన్లనే నిందించారట. అంతేకాదు పనిలో ఒత్తిడి పెరిగిపోవడం, జాబ్‌లో నిరాశక్తత ఉండడం ఇవన్నీ ఫోన్ వల్ల వచ్చిన దుష్‌ప్రభావాలే అని ఈ సర్వే తేల్చింది. అంతేకాదు ఫోన్ వాడకం వల్ల డ్రైవింగ్‌లో ఎక్కువ రిస్క్‌లు తీసుకుంటున్నట్లు ..కొన్ని సార్లు గాయాలపాలు కూడా అవుతున్నట్లు జనం చెబుతున్నారు.
ఎన్ని వయసుల వాళ్లకు టెక్నాలజీపై మంచి అవగాహన వచ్చిందని.. కానీ దాన్ని కన్నా నష్టమే ఎక్కువ వాటిల్లిందని పరిశోధకులు చెబుతున్నారు. గత 13 ఏళ్లలో ఫోన్ల వాడకం ఊహించనంతగా పెరిగిపోయిందని..ఇది మానవాళికి మేలు చేసే విషయం కాదని వారు చెప్పారు. ఈ సర్వే లెక్కల ప్రకారం మహిళల్లో 19.5 శాతం, పురుషుల్లో 11.8 శాతం నిద్ర కోల్పోతున్నారట. తమ జాబ్‌లో ప్రొడెక్టవిటీ తగ్గిపోతుందని 12.6 శాతం మంది తెలిపారు. 54 శాతం మంది తమ స్నేహితులను కలవలేకపోతున్నామని వాపోయారట.