• తాజా వార్తలు

నిజంగా స్మార్ట్‌ఫోన్ల ధ‌ర‌లు త‌గ్గ‌డానికి చైనా ఫోన్లే కార‌ణ‌మా? ఒక కొత్త కోణం

స‌రిగ్గా ప‌న్నెండేళ్ల క్రితం భార‌త్‌లో సెల్‌ఫోన్ అంటే చాలా రేర్‌గా క‌నిపించేవి. రిల‌య‌న్స్ ఫోన్లు వ‌చ్చిన త‌ర్వాత మొత్తం ప‌రిస్థితి మారింది. ఎక్కువ‌మంది చేతుల్లో రిల‌య‌న్స్ సీడీఎంఏ ఫోన్లు క‌నిపించేవి. కానీ భార‌త్‌లో సెల్‌ఫోన్ విప్ల‌వానికి తెర తీసి.. త‌క్కువ ధ‌ర‌ల‌కు తీసుకొచ్చిన ఘ‌న‌త మాత్రం చైనా ఫోన్ల‌దే. భార‌త్‌లో కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌చ్చేసిన చైనా కంపెనీలు సెల్‌ఫోన్ల రేట్ల‌ను చీప్ చేసేశాయి. ఒప్పో, షియోమి లాంటి కంపెనీలు త‌క్కువ ధ‌రల‌కు మంచి పోన్లు అందించి వినియోగ‌దారుల‌ను ఆకట్టుకున్నాయి. 

యాపిల్‌తో మొద‌లు
2007లో వ‌చ్చిన యాపిల్ ఫోన్లే భార‌త్‌తో మొద‌టి స్మార్ట్‌ఫోన్లుగా చెబుతారు.  అయితే యాపిల్ క్లోజ్డ్ ఎకో సిస్ట‌మ్ మెయిన్‌టెన్ చేయ‌డం.. ఐవోఎస్ మాత్ర‌మే ఆఫ‌ర్ చేయ‌డం వ‌ల్ల ఎక్కువ‌మంది యూజ‌ర్ల‌కు ఇది అందుబాటులో లేకుండాపోయింది. దీనికి తోడు ధ‌ర ఎక్కువ‌గా ఉండ‌డం వ‌ల్ల అంద‌రూ ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే అవ‌కాశం ఉండేది కాదు.  ఆ త‌ర్వాత బ్లాక్ బెర్రీ, నోకియా కూడా స్మార్ట్‌ఫోన్లు తెచ్చినా ఇవి కూడా సియాంబ‌న్‌, బీబీఓఎస్ లాంటి ఆండ్రాయిడ్ సిస్టమ్స్ కే ప‌రిమితం అయ్యాయి. దీంతోఎక్కువ‌మందిని ఆకర్షించ‌లేక‌పోయాయి.  అయితే శాంసంగ్ మాత్రం లేటుగా వ‌చ్చినా స్మార్ట్‌ఫోన్ల త‌యారీ  త‌న ముద్ర వేసింది ఎక్క‌వ కాలం నిల‌బ‌డింది. 

వాటి రాక‌తోనే..
శాంసంగ్ మార్కెట్లో ఉన్నా.. చైనా ఫోన్లు బ‌రిలో దిగిన త‌ర్వాత ముఖ చిత్రం మారిపోయింది. వాటిదే రాజ్యం అయిపోయింది. 5 అంగుళాల తెర‌, 13 ఎంపీ పైన కెమెరా, బ్లూటూత్‌, 2 ఎంపీ రేర్ కెమెరా, ఆండ్రాయిడ్ ఓఎస్ లాంటి ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన చైనా కంపెనీలు వినియోగ‌దారుల‌ను విశేషంగా ఆక‌ట్టుకున్నాయి.  షియోమి రెడ్ మి లాంటి ఫోన్ల వ‌ల్ల ఫోన్ ధ‌ర‌లు అనూహ్యంగా త‌గ్గిపోయాయి. 5000 వేల లోపు కూడా ఫోన్లు అందుబాటులోకి వ‌చ్చాయి. ఒక‌ప్పుడు 10 నుంచి 15 వేల‌కు త‌క్కువ రాని ఫోన్లు చైనా ఫోన్ల హ‌వాతో త‌క్కువ ధ‌ర‌కే వినియోగ‌దారుల‌కు దొరుకుతున్నాయి. 

జన రంజకమైన వార్తలు