• తాజా వార్తలు

టిక్‌టాక్ చైనాదా.. అయితే అన్ఇన్‌స్టాల్ చేస్తాం అన్న‌ది 21% మందేన‌ట‌

టిక్‌టాక్ ఎంత హిట్టో కొత్తగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే చైనా ఇటీవ‌ల మ‌న సైనికుల‌ను హ‌త‌మార్చ‌డం, అంత‌కు ముందు నుంచే అది పాకిస్థాన్‌కు స‌పోర్ట్‌గా ఉండ‌టంతో చైనా వ‌స్తువుల‌ను, యాప్స్ వంటి ఉత్ప‌త్తుల‌ను వాడొద్ద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. సెంట్ర‌ల్ మినిస్ట‌ర్స్ కూడా దీన్ని స‌మ‌ర్థిస్తున్నారు. అయితే ఎవ‌రెన్ని చెప్పినా దాన్ని వాడకూడ‌ద‌ని నిర్ణ‌యించుకోవాల్సింది యూజ‌ర్లే. అయితే టిక్‌టాక్ చైనాది కాబ‌ట్టి దాన్ని తొల‌గిస్తారా అని ఓ స‌ర్వే నిర్వ‌హిస్తే యూజ‌ర్లు ర‌క‌ర‌కాలుగా స్పందించారు. 

ఐఐహెచ్‌బీ గ‌న్‌షాట్ స‌ర్వే
వీడియో కంటెంట్‌తో ఇండియాలో చిన్నా పెద్దా అంద‌రినీ అల‌రిస్తున్న టిక్‌టాక్ గురించి ఇండియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యూమ‌న్ బ్రాండ్స్ (ఐఐహెచ్‌బీ) అనే సంస్థ గ‌న్‌షాట్ పేరుతో ఓ టెలిఫోన్ స‌ర్వే చేసింది. ఈ నెల‌17, 18 తేదీల్లో 408 మందిని ఫోన్లో స‌ర్వే చేసింది. టిక్‌టాక్‌కు సంబంధించి ర్యాపిడ్ ఫైర్‌లా ఓ ఐదు ప్ర‌శ్న‌లు అడిగింది. 

యూజ‌ర్లు చెప్పిన మాట‌లేమిటంటే 
* టిక్‌టాక్ చైనా యాప్ అని మాకు తెలియ‌ద‌న్న స‌ర్వేలో పాల్గొన్న వారిలో 56% మంది చెప్పార‌ట‌. 

* అస‌లు 32 శాతం మంది టిక్‌టాక్ గురించి త‌మ‌కు తెలియ‌ద‌న్నార‌ట‌.

* 21% మంది టిక్‌టాక్ చైనా యాప్ కాబ‌ట్టి దాన్ని అన్ ఇన్‌స్టాల్ చేస్తామ‌ని చెప్పారు.

* 62 శాతం మంది అన్ ఇన్‌స్టాల్ చేస్తామా లేదా అని డౌట్‌గా చెప్పార‌ట‌. 

* 11 శాతం మంది మాత్రం టిక్‌టాక్‌ను ఇన్‌స్టాల్ చేయ‌బోమ‌ని క‌చ్చితంగా చెప్పేశార‌ని స‌ర్వే పేర్కొంది.  
 

జన రంజకమైన వార్తలు