• తాజా వార్తలు

వర్క్ ఫ్రమ్ హోమ్ .. కంపెనీల కొంప ముంచుతోందా?   

వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఐటీ ఉద్యోగులకే. ఇది పాత మాట. మీడియా నుంచి మొదలుపెట్టి ఇప్పుడు చాలా రంగాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తోంది ఇప్పుడు. దీనికి కారణం కరోనాయే. అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కంపెనీలకు కొత్త చిక్కులు తెచ్చి పెడుతోంది. చాలా కంపెనీల్లో ఉద్యోగులు  వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుండడంతో ఎక్కువ డివైస్ లు రిమోట్ ఏరియాల నుంచి పని చెస్తున్నాయి. ఇది కంపెనీల డేటా భద్రతకు ప్రమాదంగా మారుతోందని బరాక్కుడ నెట్వర్క్స్ అనే కంపెనీ సర్వే చేసి చెప్పింది. 

5 దేశాల్లో 1000 మందితో స‌ర్వే
ఇండియా, ఆస్ట్రేలియా, సింగపూర్, న్యూజిలాండ్, హాంకాంగ్ ల్లో 1000 మంది కంపెనీ అధికారులతో సర్వే చేసినట్టు బరాక్కుడ ప్రకటించింది.    సర్వే లో ముఖ్యమైన అంశాలివే  

*67 % కంపెనీల్లో ఉద్యోగులు పిషింగ్ మెయిల్స్ ను ఎదుర్కొంటున్నారు. 

*  మ‌రో 64 %కంపెనీలు వచ్చే నెలలో ఇదే ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాయి. 

*  ఈ డేటా లీకేజ్‌, పిషింగ్ మెయిల్స్ వ‌ల్ల 70 % కంపెనీల‌కు వచ్చే ఆరు నెలల్లో బిజినెస్ డిస్టర్బ్ అయ్యే  అవకాశాలున్నాయి.

* 53 % కంపెనీలకి ఈ డేటా చోరీ, ఫిషింగ్ మెయిల్స్ ను కంట్రోల్ చేయగలిగే సాంకేతిక సంపత్తి లేదని సర్వే తేల్చింది.

జన రంజకమైన వార్తలు