• తాజా వార్తలు

జియో ఫేస్‌బుక్ డీల్‌పై స‌మీక్షించ‌నున్న సీసీఐ... ఏం జ‌రుగుతుంది? 

జియోలో ఫేస్‌బుక్ దాదాపు 43వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా పెట్టుబ‌డి పెట్ట‌డం బిజినెస్ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం సృష్టించింది. భార‌తీయ టెలికం రంగంలో అతిపెద్ద విదేశీ పెట్టుబ‌డి బహుశా ఇదే కావ‌చ్చు. ఫేస్‌బుక్ అంత‌టి ప్రపంచ ప్ర‌ఖ్యాత కంపెనీ పెట్టుబ‌డి పెట్ట‌డంతో ఆ త‌ర్వాత జియోలోకి విదేశీ పెట్టుబ‌డులు వ‌ర‌ద‌లా వ‌చ్చిప‌డుతున్నాయి. అయితే ఫేస్‌బుక్ జియో డీల్‌ను కాంపిటీష‌న్ క‌మిష‌న్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రివ్యూ చేయబోతోంది.

ఎందుకు రివ్యూ?‌
ఇండియాలో  ఈకామ‌ర్స్ సైట్లు భారీ డిస్కౌంట్లు ఇస్తుండ‌టం త‌మ వ్యాపారాల‌ను దెబ్బ‌తీస్తున్నాయని దేశీయ వ్యాపార సంస్థ‌లు 
సీసీఐకు కంప్లయింట్స్ చేశాయి. ఇదిలా ఉండ‌గా జియో ఫేస్‌బుక్‌తో వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డి పొందింది. ఇంట‌ర్నెట్ యూజ‌ర్ల పరంగా ఇండియా ప్ర‌పంచంలోని అతిపెద్ద మార్కెట్లలో ఒక‌టి. ఈ ప‌రిస్థితుల్లో జియోతో ఫేస్‌బుక్ ఒప్పందం వ‌ల్ల యూజ‌‌ర్ల డేటా మిస్ యూజ్ అయ్యే అవ‌కాశాలున్నాయా అని సీసీఐ రివ్యూ చేయ‌బోతుంది. దీన్ని సీసీఐ ఛైర్మ‌న్ అశోక్ కుమార్ గుప్తా ధృవీకరించారు. 

ఎన్నాళ్లలో రివ్యూ?
అయితే జియో ఫేస్‌బుక్ డీల్‌ను ఎన్నాళ్ల‌లో రివ్యూ చేయ‌బోతున్నామో సీసీఐ వెల్ల‌డించ‌లేదు. ఒక‌వేళ యూజ‌ర్ల డేటాకు ఏమైనా 
ప్ర‌మాదం ఉందా అనేది రివ్యూలో తేలితే దానికి త‌గ్గ‌ట్లు సీసీఐ యాక్ష‌న్ తీసుకునే అవ‌కాశాలున్నాయి. భార‌తీయ న్యాయ‌సూత్రాల ప్ర‌కారం 210 రోజుల్లోగా అంటే 7 నెలల్లోగా సీసీఐ రివ్యూ చేయ‌క‌పోతే మాత్రం ఆ డీల్ ఆటోమేటిగ్గా ఆమోదం పొందిన‌ట్లే. ఈ ప‌రిస్థితుల్లో మ‌రో 6 నెలల్లోగా సీసీఐ ఈ డీల్‌ను రివ్యూ చేయాల్సి ఉంటుంది. 

జన రంజకమైన వార్తలు