• తాజా వార్తలు

భార‌త్ టిక్‌టాక్ బ్యాన్‌.. తెలుసుకోవాల్సిన కీల‌క విష‌యాలు

టిక్‌టాక్‌.. ఇప్పుడు దీనికి మించిన హాట్ టాపిక్ ఉండ‌దేమో... ఏ కుర్రాడిని క‌దిలించినా.. ఏ అమ్మాయిని అడిగినా టిక్ టాక్ గురించి ట‌క ట‌కా చెప్పాస్తారు. అంత‌గా యూత్‌లోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా యువ‌త‌కు ఈ టిక్‌టాక్ ఒక వ్య‌స‌నంలా మారిపోయింది. ఈ నేప‌థ్యంలో టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాల‌ని సుప్రీం కోర్టు ఆర్డ‌ర్ ఇచ్చింది. దీనికి కార‌ణం ఈ యాప్ చైనా త‌యారు చేయ‌డం.. మ‌రొక‌టి ఈ యాప్‌కు అడిక్ట్ అయిపోవ‌డం. ఈ నేప‌థ్యంలోమ‌నం టిక్‌టాక్ బ్యాన్ గురించి కొన్ని కీల‌క విష‌యాలు తెలుసుకోవాలి.

టిక్‌టాక్ యాప్ జ‌నాల‌ను పొల్యూట్ చేస్తుంద‌ని మొద‌ట మ‌ద్రాస్‌లో ఒక కేసు ఫైల్ అయింది. ఈ కేసుని విచారించిన మ‌ద్రాస్ హైకోర్టులోని ముగ్గురు న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం టిక్‌టాక్‌ను భార‌త్‌లో బ్యాన్ చేయాల‌ని తీర్పు ఇచ్చింది. ఈ యాప్‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో డౌన్‌లోడ్ చేయ‌కూడ‌ద‌ని కూడా న్యాయ‌స్థానం చెప్పింది. తాజాగా సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పును స‌మ‌ర్థిస్తూ టిక్‌టాక్‌ను భార‌త్ వ్యాప్తంగా బ్యాన్ చేయాల‌ని తీర్పు వెలువ‌రించింది. దీనికి చాలా కార‌ణాలు ఉన్నాయి. భార‌త్‌లో 100 మిలియ‌న్ల మంది టిక్‌టాక్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. వారిలో 20 మిలియ‌న్ల మంది యాక్టివ్ యూజ‌ర్లు ఉన్నారు. వారిలో ఎక్కువ‌మంది టీనేజ‌ర్లే. ముఖ్యంగా ఏమాత్రం మెచ్యూరిటీ లేని కాలేజ్‌, పాఠ‌శాల పిల్ల‌లు సైతం టిక్‌టాక్ వెంట‌ప‌డుతున్నారు. అంతేకాదు ప్ర‌మాద‌క‌ర విన్యాసాలు చేస్తున్నారు. లైక్స్ కోసం ఎలాంటి ప‌నుల‌కైనా సిద్ధ‌ప‌డుతున్నారు. ముఖ్యంగా అమ్మాయిలైతే అశ్లీలంగా ఉండే దుస్తులు ధ‌రిస్తూ త‌మ‌ను తాము ప్ర‌దర్శించుకుంటున్నారు. టిక్‌టాక్‌ను న‌మ్మి ప్రేమించి మోస‌పోయిన‌వాళ్లు కూడా ఉన్నారు.

ఉద‌యం లేచిన దగ్గ‌ర నుంచి రాత్రి వ‌ర‌కు ఇదే ధ్యాస. త‌మ‌కు ఏమైనా లైక్స్, కామెంట్స్ వ‌చ్చాయి. బ్యాడ్ కామెంట్స్ వ‌స్తే ఏం చేయాలి.. ఎలా రెస్పాండ్ అవ్వాలి.. అని టీనేజ‌ర్లు మ‌థ‌న‌ప‌డుతున్నార‌ట‌. చాలామంది గృహిణులు కూడా దీనికి బాగా అల‌వాటు ప‌డిపోయారు. దీని వ‌ల్ల ఇంట్లో భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వ‌లు వ‌స్తున్నాయ‌ట‌. దీనిలో కొన్ని సంఘాల‌, కుల ఘ‌ర్ష‌ణ‌లు, మ‌త ఘ‌ర్ష‌ణ‌లు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ ప‌రిస్థితుల నేప‌థ్యంలో టిక్‌టాక్‌ను ఇక‌పై డౌన్‌లోడ్ చేసుకోకూడ‌ద‌ని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్ప‌టికే డౌన్‌లోడ్ చేసుకున్న‌వాళ్ల‌కు కూడా ఇంకెంత కాల‌మో ఈ యాప్ ప‌ని చేయ‌దు. 

జన రంజకమైన వార్తలు