ఐటీ రంగంలో ఇండియన్ ఐటీ దిగ్గజం టాటా కన్సలెన్ట్సీ సర్వీసెస్ (టీసీఎస్) సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ కంపెనీగా నిలిచింది. ఇప్పటి వరకు ప్రపంచంలో అత్యంత విలువైన ఐటీ కంపెనీగా ఉన్న యాక్సెంచర్‌ను వెనక్కి నెట్టింది .
బైబ్యాక్ బ్యాకప్‌తో
బైబ్యాక్ వార్తలతో టీసీఎస్ షేర్లు బీఎస్ఈలో గురువారం 3.19 శాతం లాభంతో రూ.2,824.80 వద్ద ముగిశాయి. దీంతో టీసీఎస్ మార్కెట్ విలువ గురువారం ఒక్కరోజే రూ.32,796.63 కోట్లు పెరిగి రూ.10.60 లక్షల కోట్లకు (14,473 కోట్ల డాలర్లు) చేరింది.
* టీసీఎస్ తాజా విలువ యాక్సెంచర్ షేర్ల మార్కెట్ క్యాప్ కంటే ఏకంగా 233 కోట్ల డాలర్లు ఎక్కువ.
46 దేశాల్లో కార్యకలాపాలు
1968లో ముంబయి హెడ్‌క్వార్టర్‌గా ప్రయాణం ప్రారంభించిన టీసీఎస్ ఇప్పుడు 46 దేశాల్లో ఐటీ సర్వీసెస్ అందిస్తోంది. ఈ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా నాలుగన్నర లక్షల మంది ఎంప్లాయిస్ పని చేస్తున్నారు.