ప్రస్తుతం నడుస్తున్న స్మార్ట్ ఫోన్ శకం లో ఎక్కువ శాతం అమ్ముడుపోయేవి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లే. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కూడా హై ఎండ్ ఫీచర్ లు ఉన్న స్మార్ట్ ఫోన్ లను బడ్జెట్ రేంజ్ లో అందించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. అయితే హై ఎండ్ మొబైల్ లతో పోల్చినపుడు వీటి స్థాయి ఏమంత ఆశాజనకంగా ఉండడం లేదు. బడ్జెట్ ధర లో స్మార్ట్ ఫోన్ లను వినియోగదారులు కొంటున్నప్పటికీ హై ఎండ్ మొబైల్ ల నాణ్యత తో పోల్చి చూసుకుంటే వినియోగదారుడు అంత సంతృప్తిగా ఉండడం లేదు. అయితే ఈ స్మార్ట్ ఫోన్ లకు కొన్ని అదనపు ఫీచర్ లను జోడించడం ద్వారా లేదా అప్ డేట్ చేయడం ద్వారా వీటిని మరింత ఆకర్షణీయంగా మరియు హై ఎండ్ మొబైల్ లకు దీటుగా తయారు చేయవచ్చు. అలాంటి ఒక ఐదు ఫీచర్ ల గురించి ఈ ఆర్టికల్ లో చూద్దాం.
1 . అన్నింటికంటే సరికొత్త ఆండ్రాయిడ్ అప్ డేట్
అవును. ఇప్పుడు మార్కెట్ లో లభిస్తున్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లలో ఉండే ఆపరేటింగ్ సిస్టం ఆండ్రాయిడ్ యొక్క మునుపటి వెర్షన్ లలోనే ఉంటుంది. ఉదాహరణకు ఈ సంవత్సరం ఇప్పటివరకూ విడుదల అయిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లలో ఉన్నది ఆండ్రాయిడ్ యొక్క మార్ష్ మాలో వెర్షన్. అయితే ఈ వెర్షన్ విడుదల అయ్యి ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతుంది. దీని తర్వాత ఆండ్రాయిడ్ నౌగట్ అనే ఆపరేటింగ్ సిస్టం ను కూడా విడుదల చేసింది. వినియోగదారులు ఎప్పటికప్పుడు అప్ డేటెడ్ గా ఉంటున్నారు. కాబట్టి తమ ఫోన్ లలో ఉండే ఆపరేటింగ్ సిస్టం కూడా అప్ డేటెడ్ గా ఉండాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి స్మార్ట్ ఫోన్ తయారీదారులు ముందుగా ఈ విషయం పై దృష్టి పెట్టాలి.
2. కనీసం 32 GB ఉండే ఇంటర్నల్ స్టోరేజ్
ఎట్టకేలకు ఆపిల్ తన ఐ ఫోన్ 7 ద్వారా ఇంటర్నల్ స్టోరేజ్ ను 32 GB కి పెంచుకున్నది. ఈ పని సామ్సంగ్ ఎప్పుడో చేసింది. కాబట్టి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లు కూడా ఇదే ట్రెండ్ ను ఫాలో అయితే వినియోగదారులను మరింత ఆకర్షించవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం లభిస్తున్న 16 GB ఇంటర్నల్ మెమరీ తో వినియోగదారులు విసిగిపోయి ఉన్నారు. ఈ స్టోరేజ్ ను పెంచడం ద్వారా మరిన్ని యాప్ లను తమఫోన్ లలో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు , మరిన్ని వీడియో లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు కెమెరా ను సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి ఈ ఇంటర్నల్ స్టోరేజ్ పెంచడం అనేది అతి ముఖ్యమైన అంశం
3. USB టైప్ – C
దురదృష్టవశాత్తూ స్మార్ట్ ఫోన్ తయారీ దారులు ఇంతవరకూ ఈ తరహా యూ ఎస్ బి కి ఇంకా అప్ డేట్ అవలేదు. ప్రస్తుతం నడుస్తున్న మైక్రో యూ ఎస్ బి అవుట్ డేటెడ్ అయిపోయింది. దాదాపు అన్ని బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లలోనూ ఈ దిశగా ఇంతవరకూ ఏ విధమైన ముందడుగు పడలేదు కాబట్టి కంపెనీలు ఈ అంశం పై దృష్టి పెట్టవలసిన అవసరo ఉంది
4. నాణ్యమైన క్విక్ ఛార్జింగ్
స్మార్ట్ ఫోన్ వినియోగదారులు పరిశీలించే మరొక ముఖ్యమైన అంశం క్విక్ చార్జింగ్. స్మార్ట్ ఫోన్ ల లో ఉండే యాప్ లు మరియు ఇతరత్రా ఫీచర్ లు బ్యాటరీ ని ఎక్కువ తినేస్తూ ఉంటాయి, కాబట్టి క్విక్ చార్జింగ్ ఫీచర్ అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం. ప్రస్తుతం ఉన్న బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లలో క్విక్ చార్జింగ్ ఫీచర్ లు ఉన్నప్పటికీ అది ప్రస్తుత పరిశ్రమ లో ఉన్న ప్రమాణాలకు ధీటుగా లేదు. కాబట్టి అత్యంత నాణ్యమైన ప్రమాణాలతో కూడిన క్విక్ చార్జింగ్ ఫీచర్ లను కూడా ప్రవేశపెట్టవల్సి ఉంది.
5. మైక్రో ఎస్ డి కార్డు కోసం ఒక డెడికేటెడ్ స్లాట్
స్మార్ట్ ఫోన్ పరిశ్రమ గత కొంత కాలం నుండీ ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. గత సంవత్సరం నుండీ మొదలైన హైబ్రిడ్ స్లాట్ ట్రెండ్ అనేది ఫోన్ లో ఉండే అతి తక్కువ మెమరీ ని కాపాడుతుంది. అయినప్పటికీ మైక్రో ఎస్ డి కోసం ఒక డెడికేటెడ్ స్లాట్ ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.