• తాజా వార్తలు

మ‌న మ‌ర‌ణం త‌ర్వాత మ‌న డిజిట‌ల్ లైఫ్ ఏమ‌వుతుంది? మొదటి బాగం

ఇండియాలో ఇప్పుడు దాదాపు మూడో వంతు మందికి గూగుల్ అకౌంట్ ఉంది.  దానిలో జీమెయిల్‌తోపాటే గూగుల్ డ్రైవ్‌, గూగుల్ ఫోటోస్‌, గూగుల్ హ్యాంగ‌వుట్స్ అన్ని అకౌంట్లు క్రియేట్ అవుతాయి. మీరు స్మార్ట్‌ఫోన్‌లో తీసే ఫోటోలు, మీకు వ‌చ్చే వాట్సాప్ మెసేజ్‌ల బ్యాక‌ప్ ఇలా మీకు సంబంధించిన చాలా స‌మాచారం వాటిలో నిక్షిప్త‌మ‌వుతుంది. కానీ మ‌నం  చనిపోయాక ఈ అకౌంట్లు ఏమవుతాయి? కొన్నాళ్లపాటు ఇన్ ఆక్టివ్‌గా ఉన్నాక అకౌంట్లు వాటికవే పోతాయా? అయితే అందులో ఉన్న డేటా ఏమవుతుంది? దాన్ని మన వారు ఎవరైనా తీసుకోవాలంటే అవకాశం ఉందా? ఇలాంటి డౌట్లు మీకు ఎప్పుడైనా వచ్చాయా? కచ్చితంగా వచ్చి తీరాలి. ఎందుకంటే మన డిజిటల్ లైఫ్ మన తర్వాత ఏమవుతుందో ముందుగానే మనం నిర్ధారించుకోవాలి. దీనికి ఏం చేయాలో ఈ ఆర్టికల్ లో చూద్దాం. 

గూగుల్ ఇన్ యాక్టివ్ మేనేజ‌ర్‌
ప్పుడు ప్రపంచంలో అత్య‌ధిక మంది వాడే డిజిటల్ స‌ర్వీస్ గూగుల్‌.  యూజర్లు తమ తదనంతరం  గూగుల్ అకౌంట్ ను ఏం చేయాలో ముందుగానే నిర్ధారించుకోవడానికి ఇన్ ఆక్టివ్ మేనేజర్ అనే ఆప్షన్ ప్రవేశపెట్టింది. 

* దీన్ని  ఎనేబుల్ చేసుకొని మూడు నెలలు లేదా ఆరు నెలలు లేదా ఏడాది లేదా రెండేళ్లపాటు టైం ఫిక్స్ చేసుకోవచ్చు. ఆ టైంలో ఈ గూగుల్ అకౌంట్లో ఎలాంటి యాక్టివిటీ లేకపోతే మీరు చనిపోయినట్లు లేదా అకౌంట్‌ను మీరు వ‌దిలేస్తున్న‌ట్లు గూగుల్ భావిస్తుంది. 

* ముందుగానే మీరు సెట్ చేసిన పర్సన్ అకౌంట్‌కు మీ డేటాను ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తుంది. ఇలా డేటా ట్రాన్స్‌ఫ‌ర్ చేయడానికి 10 అకౌంట్లను మీరు ముందే సెట్ చేసుకోవచ్చు.  

* మీ జిమెయిల్ అకౌంట్, గూగుల్ హ్యాంగ‌వుట్‌,  గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్‌లో ఉన్న మీ డేటా అంతా వీరి అకౌంట్లకు ట్రాన్స్‌ఫ‌ర్ అవుతుంది. మూడు నెలల్లోగా వారు ఈ డేటాను డౌన్లోడ్ చేసుకోవాలి. లేదంటే డేటా మొత్తం పోతుంది. 

ఇన్‌యాక్టివ్ మేనేజ‌ర్ సెట్ చేసుకోక‌పోతే..
ఒకవేళ మీరు ఇన్ యాక్టివ్ మేనేజ‌ర్ ఆప్ష‌న్‌ను సెట్ చేసుకోక‌పోయినా మీ వార‌సులు ఎవ‌రైనా మీ డిజిట‌ల్ అకౌంట్లో ఉన్న డేటా త‌మ‌కు కావాల‌ని గూగుల్‌కు అప్లికేష‌న్ పెట్టుకోవ‌చ్చు. గూగుల్ దాన్ని నిశితంగా ప‌రిశీలించి, మీరు స‌రైన వార‌సులే అని నిర్ధారించుకుంటే ఆ డేటాను మీకు అందిస్తుంది. మీరు కోరితే ఆ అకౌంట్‌ను క్లోజ్ కూడా చేస్తుంది. అయితే ఆ అకౌంట్ పాస్ వ‌ర్డ్ మాత్రం మీకు ఇవ్వ‌దు


 మైక్రోసాఫ్ట్‌
మైక్రోసాఫ్ట్‌లో గూగుల్‌లో మాదిరిగా ఇలాంటి సెట‌ప్ లేదు. అయితే మైక్రోసాఫ్ట్ అకౌంట్‌కు సంబంధించి.. నెక్స్ట్ టు కిన్ అనే ప్రాసెస్ ఉంది. 

* చ‌నిపోయిన మీ వారి ఈ మెయిల్ ట్రాన్సాక్ష‌న్స్‌,  మైక్రోసాఫ్ట్ అకౌంట్లో ఉన్న డేటా మీకు కావాలంటే emailingmsrecord@microsoft.comకు మీరు మెయిల్ చేయాలి.  మీరు వారి వార‌సులే అని ప్రూఫ్స్ కూడా షేర్ చేయాలి. 

* అవ‌న్నీ క‌రెక్ట్‌గా ఉన్నాయ‌ని  మైక్రోసాఫ్ట్  భావిస్తే 'Windows Live Custodian of Recordsను అప్రోచ్ అవుతుంది. 

* అమెరికా, యూర‌ప్ దేశాలు లేదా ఇత‌ర ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఉంటే మైక్రోసాఫ్ట్ మీ రిక్వెస్ట్‌తో కోర్ట్‌ను అప్రోచ్ అవుతుంది. వారిచ్చిన సూచ‌న‌ల‌ను బ‌ట్టి చ‌నిపోయిన మీ సంబంధీకుల మైక్రోసాఫ్ట్ అకౌంట్‌లో ఉన్న డేటాను మీకు ఇస్తారు. 

* మైక్రోసాఫ్ట్ కూడా ఆ అకౌ్ంట్ పాస్‌వ‌ర్డ్ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ మీకు చెప్పదు. 
 

జన రంజకమైన వార్తలు