• తాజా వార్తలు

రోజు రోజుకి స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌లు పెరుగుతున్నాయ్ ఎందుకు?

స్మార్ట్‌ఫోన్లు వ‌చ్చిన కొత్త‌లో చాలా ఎక్కువ ధ‌ర‌లు ఉండేవి.. కానీ పోటీ పెర‌గ‌డం వ‌ల్ల‌.. సెల్‌ఫోన్ కంపెనీలు ఒక దానితో ఒక‌టి పోటీప‌డి ఆఫ‌ర్లు పెట్ట‌డం వ‌ల్ల స్మార్ట‌ఫోన్ల ధ‌ర‌లు నెమ్మ‌దిగా త‌గ్గాయి. మంచి ఫీచ‌ర్లు ఉన్న ఫోన్లు కూడా త‌క్కువ ధ‌ర‌ల‌కే రావ‌డం మొద‌లుపెట్టాయి. అయితే మ‌ళ్లీ ట్రెండ్ మారింది ఇప్పుడు రోజు రోజుకు సెల్‌ఫోన్ ధ‌ర‌లు పెరిగిపోతూ ఉన్నాయి. ఒక్క నెల‌లోనే ధ‌రల్లో మార్పులు క‌నిపిస్తున్నాయి. మ‌రి ఎందుకు ఇలా జ‌రుగుతోంది? అస‌లు స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌లు ఎందుకు పెరిగిపోతున్నాయ్?

ఇప్పుడు ఫోన్ల ధ‌ర‌లు నాలుగు అంకెల‌ను మించి పోతున్నాయి. ఐఫోన్ ఎక్స్ మోడ‌లే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌.. ప్ర‌స్తుతం ఈ మోడ‌ల్‌ను 1000 డాల‌ర్ల‌కు అమ్ముతున్నారు. అన్నిటికంటే విశేషం ఏమిటంటే ఎక్కువ‌గా అమ్ముడుపోయిన ఫోన్ల‌లో ఈ మోడ‌ల్ కూడా ఉండ‌డం.  ఇంత ధ‌ర పెట్టినా కూడా కస్ట‌మ‌ర్లు మాత్రం ఐఫోన్ ఎక్స్‌ను కొన‌డానికి మ‌క్కువ చూపారు. యాపిల్ చూపిన మార్గంలోనే ఇప్పుడు అన్ని కంపెనీలూ ప‌య‌నిస్తున్నాయి. ఎందుకంటే మంచి పీచ‌ర్లు పెట్టి ఎక్కువ ధ‌ర పెడితే కూడా క‌స్ట‌మ‌ర్లు క‌చ్చితంగా కొంటార‌నే అభిప్రాయం సెల్‌ఫోన్ కంపెనీలకు వ‌చ్చేసింది. దీంతో శాంసంగ్‌, గూగుల్ కూడా ఐఫోన్ మాదిరిగానే భారీ ధ‌ర‌ల‌తో మంచి ఫీచ‌ర్ల‌తో ఫోన్ల‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. 

గ్లోబ‌ల్ ఎకాన‌మీ కూడా స్మార్ట్‌ఫోన్ ధ‌ర‌లు పెర‌గ‌డానికి ఒక ప్ర‌ధాన కార‌ణంగా ఉంది. ప్రొఫిట్స్ రావ‌డం కోసం.. ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డం కోసం సెల్‌ఫోన్ కంపెనీలు ధ‌ర‌ల‌ను రోజు రోజుకూ పెంచుకుంటూ పోతున్నాయి. ఆఫ‌ర్లు ఇచ్చిన‌ప్పుడు త‌ప్ప సెల్ ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పులు ఉండ‌ట్లేదు. దీనికి తోడు సెల్‌ఫోన్ మేకింగ్ రోజు రోజుకి కాస్ట‌లీ అవుతుంది. దీన్ని త‌యారు చేసే స్కిల్డ్ వ‌ర్క‌ర్ల‌తో పాటు దానికి కావాల్సిన మెటీరియ‌ల్ మీద కూడా కంపెనీలు మునుప‌టి కంటే ఎక్కువ ఖ‌ర్చులు చేయాల్సి వ‌స్తోంది. అందుకే  సెల్‌ఫోన్‌ ధ‌ర‌లు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. 

జన రంజకమైన వార్తలు