• తాజా వార్తలు

షియోమీ, యాపిల్ ని కాపీ కొడుతుందనడానికి పది కారణాలు.

భారత మొబైల్ మార్కెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది చైనా మొబైల్ దిగ్గజ సంస్థ షియోమీ. టెక్నాలజీలోకి ప్రవేశించిన కొద్దికాలంలోనే దిగ్గజాలను సైతం వెనక్కినెట్టింది. అయితే షియోమీ మొబైల్ రంగంలో దూసుకుపోతున్నప్పటికీ...దానిపై పడిన ఓ ముద్రం మాత్రం చెరిగిపోవడం లేదు. షియోమీ నుంచి ప్రతి ప్రొడక్టు యాపిల్ ని కాపీ కొడుతోంది. అందుకే షియోమీకి యాపిల్ అనే పేరు పడిపోయింది. యాపిల్ కంపెనీ నుంచి ఏదైనా ప్రొడక్టు  రిలీజ్ అయ్యిందంటే చాలు...దాన్ని షియోమీ కాపీ కొట్టాల్సిందే. యాపిల్ ను కాపీ కొట్టిన షియోమీ ప్రొడక్టులేంటో ఓ సారి చూద్దం. 

1. ఐఫోన్ 5ని కాపీ కొట్టిన ఎంఐ4..
ఐఫోన్ 5ని కాపీ కొడుతూ....ఎంఐ4ని మార్కెట్లోకి దించింది షియోమీ. స్క్రీన్ పరంగా చూసినా...డిజైన్ పరంగా చూసిన రెండూ ఒకేలా ఉన్నాయి. అంతేకాదు 2014లో షియోమీ సీఈఓ లీ జూన్ కూడా...దివగంత యాపిల్ బాసు స్టీవ్ జాబ్స్ ను కాపీ కొట్టాడు. ఓ ఈవెంట్లో జాబ్స్ డ్రెస్ కోడ్ అయిన బ్లాక్ షర్ట్, బ్లూ జీన్స్ తో దర్శనమిచ్చారు. 
2. ఐఫోన్ 5సి మాదిరిగా ఎంఐ ప్యాడ్స్....
ఎంఐ ప్యాడ్స్ , ఐప్యాడ్ మినిని పోలీ ఉంటాయి. రెండూ ఒకేమాదిరిగా కనిపిస్తాయి. ఐఫోన్ 5సిని మక్కీకి మక్కీ దించినట్లుగా ఉంటాయి. 

3. షియోమీ ఎంఐ మిని రూటర్...
యాపిల్ మ్యాజిక్ ట్రాక్ ప్యాడ్ లా....షియోమీ ఎంఐ మిని రూటర్ ఉంటుంది. డిజైన్ పరంగా పరిశీలించినట్లయితే యాపిల్ ను కాపీ కొట్టినట్లే కనిపిస్తుంది. 

4. ఐఫోన్ ఎక్స్ ని కాపీ కొట్టిన ఎంఐ8..ఈ రెండు ఫోన్లు కూడా  ఒకే విధంగా కనిపిస్తాయి. రెండు కవలలు అని కూడా అనుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  

5. ఆపిల్ ఎయిర్ ప్యాడ్  షియోమి ఎయిర్ డాట్స్..
ఇయర్ ఫోన్ విషయంలో కూడా షియోమీ కాపీ కొట్టింది. కాపీ కొట్టడంలో తనకు తానే సాటి అని నిరూపించుకుంది. ఈ రెండింటిని పరిశీలిస్తే ....స్పష్టంగా అర్థమవుతుంది. 
6. ఐఓఎస్7ని ...కాపి కొట్టి MIUI 6..
MIUI 6 కూడా ios ని కాపీ కొట్టింది. అందులో కనిపించే క్యాలండర్లు , కాలిక్యులేటర్ అన్ని ఒకే విధంగా ఉంటాయి.

7.మాక్ ఓఎస్ Mojave వాల్ పేపరే ఎంఐ9 వాల్ పేపర్..
 చివరికి వాల్ పేపర్లను కూడా వదిలిపెట్టలేదు షియోమీ. పరిశీలించిన చూసినట్లయితే ఈ రెండు కూడా ఒకేలా కనిపిస్తాయి.  

8. ఆపిల్ adsలా షియోమి ads..
ఇక యాడ్స్ విషయంలోనూ యాపిల్ ను ఆదర్శంగా తీసుకుంది షియోమీ. 

9. ఆపిల్ టీవీలా షియోమి మి బాక్స్..
దీన్ని కూడా కాపీ కొట్టినట్లే అనిపిస్తోంది. రెండింటిని పోల్చి చూసినట్లయితే....వెంటనే పసిగట్టవచ్చు. 

10. ఐఫోన్ ఎక్స్ గ్వెశ్చరే MIUI 9...
ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టంను పరిశీలిస్తే ఇది కూడా అచ్చం కవలలు లాగానే ఉంటాయి.

జన రంజకమైన వార్తలు