ఆధార్ డేటా లీక్ పై వివిధ రకాల వివాదాలు ముసురుకుంటున్న నేపథ్యం లో భారత సుప్రీమ్ కోర్ట్ కూడా మొబైల్ నెంబర్ కు ఆధార్ సీడింగ్ తప్పనిసరి కాదని స్పష్టం చేసిన విషయం మన కంప్యూటర్ విజ్ఞానం పాఠకులకు విదితమే. ఈ సందర్భంగా ఇప్పటివరకూ మన దేశం లో ఈ ఆధార్ డేటా లీక్ అయిన సందర్భాలను నెలల వారీగా ఒక లిస్టు రూపం లో ఈ ఆర్టికల్ లో చూద్దాం.
మే 2018
2.5 లక్షల తెలంగాణా పెన్షన్ దారుల ఎకౌంటు వివరాలు లీక్ అయ్యాయి.
ఏప్రిల్ 2018
20,71,913 మంది గర్భిణీ స్త్రీల ఆధార్ మరియు ఫోన్ నెంబర్ డేటా ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఒక వెబ్ సైట్ లీక్ చేసింది.
లోక్ సత్తా అనే ఒక మరాఠీ దినపత్రిక ఆధార్ నెంబర్ లో పేరు మార్పులకు సంబందించిన నోటిఫికేషన్ ను ప్రచురించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వెబ్ సైట్ నుండి సుమారు 67 లక్షల చిన్నారుల ఆధర్ నెంబర్ లు లీక్ అయ్యాయి.
89 లక్షల MNREGS వర్కర్ల ఆధార్ డేటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్ సైట్ నుండి లీక్ అయింది.
వ్యక్తుల మతము, కులమునకు సంబందించిన డేటా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వెబ్ సైట్ నుండి లీక్ అయింది.
ఆధార్ మరియు పాన్ డేటా లీక్ గురించి ప్రముఖ హాకింగ్ గ్రూప్ అయిన లుల్జ్ సేక్ ఒక రిపోర్ట్ ఇచ్చింది.
మార్చ్ 2018
mera aadhaar meri pehchaan filetype:pdf” ను సెర్చ్ చేస్తే వేలకొద్దీ ఆధార్ కార్డు ల యొక్క వివరాలు బయటపడ్డాయి.
బ్యాంకు ఎకౌంటు లతో లింక్ అవుతున్న ఆధార్ నెంబర్ ల యొక్క సమాచారం కూడా లీక్ అవుతున్నట్లు ZDnet రిపోర్ట్ ఇచ్చింది.
ఫిబ్రవరి 2018
గుజరాత్ ప్రభుత్వం యొక్క అన్నపూర్ణ యోజన కు సంబంధించి 1.27 లక్షల లబ్దిదారుల ఆధార్ డేటా లీక్ అయింది.
40 లక్షల సోషల్ సెక్యూరిటీ పెన్షన్ ల కు సంబందించిన ఆధార్ డేటా లీక్ అయినట్లు ఫ్రెంచ్ సెక్యూరిటీ రీసెర్చార్ తెలిపారు.
ఆధార్ డాక్యుమెంట్ ల యొక్క ఫోటో కాపీ లలో భేల్ పూరి సర్వ్ చేయడం గురించి షయాన్ ఘోష్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
జనవరి 2018
ఆధార్ డేటా పే టి ఏం లో అమ్ముడు అవుతుంది అన్న ఆరోపణల మీద UIDAI కి ట్రిబ్యునల్ నిబంధనలు విధించింది.
ఇండియా టుడే నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ ల ద్వారా రికార్డు కు రెండు నుండీ ఐదు రూపాయలకే ఆధార్ డేటా అమ్ముడు అవుతున్నట్లు తెలిసింది.
అక్టోబర్ 2017
UGC నిబంధనలకు విరుద్దంగా అనేక యూనివర్సిటీ లు విద్యార్థుల యొక్క ఆధార్ డేటా ను పబ్లిష్ చేశాయి.
మెరిట్ కలిగిన విద్యార్థులు యొక్క ఆధార్ వివరాలను రాష్ట్రపతి భవన్ పబ్లిష్ చేసింది.
జూలై 2017
రిలయన్స్ జియో కస్టమర్ ల యొక్క ఆధార్ డేటా లీక్ అయింది.
మే 2017
డైరెక్టరేట్ అఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పూణే 57,000 మంది విద్యార్థులకు చెందిన ఆధార్ సంబందిత బ్యాంకు ఎకౌంటు వివరాలను పబ్లిష్ చేసింది.
అల్లాగే జాయింట్ డైరెక్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కూడా 10,000 మంది విద్యార్థులకు సంబందించిన వివరాలను ప్రచురించింది.
ఫిబ్రవరి 2017
తెలంగాణా లో ఐదారు లక్షల మంది చిన్నారుల ఆధార్ డేటా లీక్ అవుతుందని కొడాలి శ్రీనివాస్ అనే వ్యక్తి పరిశోధించినట్లు తెలిపారు.