• తాజా వార్తలు

ఐఫోన్ అంత స్మార్ట్‌గా ఉండటానికి కారణం ఏంటో తెలుసా ? 

గ్లోబల్ మార్కెట్లో ఎన్ని స్మార్ట్ ఫోన్లు ఉన్నా ఆపిల్ కంపెనీనే రారాజు అనే విషయం అందరికీ తెలిసిందే. ఆ ఫోన్ ఉంటే చాలా అందరూ ధనవంతులు లాగా ఫీల్ అవుతుంటారు. మరి అన్ని కంపెనీల ఫోన్లు ఉన్నాయి ఐఫోన్ ఒక్కటే ఈ ఘనతను ఎలా సొంతం చేసుకుంది. ఈ ఐఫోన్ ని స్మార్ట్ చేసే విషయంలో ఎంతమంది పాత్ర దాగి ఉంది. వారి గురించి ప్రపంచానికి తెలుసా ? ఆర్థికవేత్త మారియానా మజ్జుటోటో కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.  వాటిని ఓ సారి పరిశీలిద్దాం. 

ఫోన్లలో వాడే ఇంటర్నెట్, జిపిఎస్ టెక్నాలజీని అమెరికా రక్షణ శాఖ తీర్చిదిద్దింది. ఐఫోన్ తో పాటు అన్ని ఫోన్లలో దీన్ని ఇప్పుడు వాడుతున్నారు. 

అల్గారిథమ్ టెక్నాలజీని మొట్టమొదటిసారి అమెరికన్ గణిత శాస్త్రజ్ఞుడు జాన్ టుకే సోవియట్ యూనియన్ అణ్వాయుధ పరీక్షను గుర్తించేందుకు అభివృద్ధి చేసాడు. దీన్ని ఇప్పుడు ఐఫోన్లో వాడుతున్నారు. 

టచ్ స్క్రీన్ విషయానికొస్తే ఇంగ్లాండ్ ప్రభుత్వ ఏజెన్సీ రాయల్ రాడార్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో ఇంజనీరు అయిన ఈఏ జాన్సన్ దీనిని మొదగా అభివృద్ది చేశారు. మల్టీటచ్ స్క్రీన్ టెక్నాలజీని అమెరికాలో డెలావేర్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది. దాన్నే ఆపిల్ కంపెనీ కొనుగోలు చేసింది.

మైక్రోప్రాసెసర్లు, మెమరీ చిప్స్ ,సాలిడ్ స్టేట్ హార్డ్ డ్రైవ్స్, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, లిథియం ఆధారిత బ్యాటరీలు వంటి హార్డ్ వేర్ పార్టలను ఆయా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తే వాటిని ఐఫోన్ లో వాడుతోంది.

ఇవే కాక ఇతర ఉత్పత్తులను కూడా ఆపిల్ కంపెనీ వాడుతోంది. ఐఫోన్ లో వాడే ప్రతి పరికరం పేటెంట్ ఆయా శాస్ర్తవేత్తలకే చెందుతుంది. అందుకే ఐఫోన్ నేడు అంత అందంగా తయారయి అందర్నీ కట్టిపడేస్తోంది. 
 

జన రంజకమైన వార్తలు