• తాజా వార్తలు

ట్రంపు దెబ్బకు 56 వేల మంది ఇండియన్ ఐటీ నిపుణలు రోడ్డుపాలు



అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల ప్రభావం భారత్ లో తీవ్రంగా కనిపిస్తోంది. 'బై అమెరికన్ అండ్ హైర్ అమెరికన్' నినాదంతో దూసుకెళ్లిన ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో 56,000 ఇండియన్ టెక్కీలు రోడ్డున పడనున్నారట.

ఇన్ఫోసిస్‌, విప్రో, టెక్‌మహీంద్ర, హెచ్‌సీఎల్‌ (భారతీయ కంపెనీలు), కాగ్నిజెంట్‌ టెక్నాలజీ సొల్యూషన్స్‌, డీఎక్స్‌సీ టెక్నాలజీ కంపెనీ, క్యాప్‌ జెమినీ సంస్థలన్నింటిలో కలిపి దాదాపు 12,40,000 మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులున్నారు. వీరిలో 4.5 శాతం అంటే దాదాపు 56 వేల మంది ఉద్యోగులపై ట్రంప్ నిర్ణయం ప్రభావం చూపనుంది. ఈ 56 వేల మందిని తొలగించేందుకు ఆయా సంస్థలు ప్రణాళికలు రచిస్తున్నాయి.

కొత్త ఉద్యోగుల నియామకంలోనూ ఈ సంస్థలన్నీ ఆచి తూచి వ్యవహరించనున్నాయి. భారత్ లో ఇంత భారీ ఎత్తున ఐటీ నిపుణులను తొలగించడం ఇదే తొలిసారని వారు చెబుతున్నారు. ఇందుకోసం ఉద్యోగుల పనితీరును తక్కువ చేసి చూపడంతో పాటు, కనిష్ట రేటింగ్స్ ఇస్తున్నారని వారు వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో 5 నుంచి 8 ఏళ్ల అనుభవం కలిగిన ఐటీ నిపుణులపై వేటు పడనున్నట్టు వారు పేర్కొన్నారు.

జన రంజకమైన వార్తలు