• తాజా వార్తలు

ప‌బ్‌జీకి ప్ర‌త్యామ్నాయంగా మ‌న ఆట‌.. ఫౌజీ

మ‌న‌దైన  ఆన్‌లైన్ గేమ్స్ త‌యారుచేయండి.. మ‌న సంస్కృతులు, మ‌న పౌరాణిక‌, జానప‌ద క‌థ‌ల్లోంచి ఈ ఆట‌ల‌కు స్టోరీలు సృష్టించండ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ మ‌న్‌కీ బాత్‌లో కూడా చెప్పారు.  అదే  స్ఫూర్తితో  ఫౌజీ అనే ఆన్‌లైన్ వార్ గేమ్‌ను తీసుకొస్తున్న‌ట్లు ఇండియ‌న్ గేమింగ్ కంపెనీ ఎన్‌కోర్ గేమ్స్ ప్ర‌క‌టించింది. శుక్ర‌వారం బాలీవుడ్ హీరో అక్ష‌య్‌కుమార్ ఈ గేమ్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు.

ఫౌజీ అంటే
ఫౌజీ అంటే హిందీలో సైన్యం అని అర్థం. ఫౌజీ (FAU-G) అంటే ఇంగ్లీష్‌లో ఫియ‌ర్‌లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్ అని పేరు పెట్టారు. భార‌తీయ సైన్యం బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ గేమ్ ఉంటుంద‌ని ఎన్‌కోర్ గేమ్స్ ప్రక‌టించింది. త్వ‌ర‌లోనే రిలీజ్ డేట్ ప్ర‌క‌టిస్తామంది. 

ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్‌లో భాగం
బాలీవుడ్ హీరో అక్ష‌య్‌కుమార్ ఈ గేమ్‌కు మెంటార్‌గా వ్య‌వ‌హరిస్తున్నారు. మ‌న‌కు కావాల్సిన‌వ‌న్నీ మ‌న దేశంలోనే త‌యారుచేసుకోవాలంటూ ప్ర‌ధాని మోడీ ప్ర‌వేశ‌పెట్టిన ఆత్మ‌నిర్భ‌ర్ భారత్ ప‌థ‌కం కింద  ఈ గేమ్‌ను సొంతంగా డెవ‌ల‌ప్ చేస్తున్న‌ట్లు అక్ష‌య్ ప్ర‌క‌టించారు.

ప‌బ్‌జీకి పోటీ కాదు
ఫౌజీని ఎప్ప‌టి నుంచో రెడీ చేస్తున్నామ‌ని, ఇది ప‌బ్‌జీకి పోటీ కాద‌ని, మ‌న ఇండియ‌న్ ఆర్మీ గొప్ప‌త‌నాన్ని తెలిపేలా ఈ గేమ్ ఉంటుంద‌ని ఎన్‌కోర్ గేమ్స్ చెప్పింది. ప‌బ్‌జీ బ్యాన్ కావ‌డం ఇప్పుడు కోఇన్సిడెంట్ మాత్ర‌మేనని చెప్పింది. 
\

జన రంజకమైన వార్తలు