చౌక ధరల్లో స్మార్ట్|ఫోన్లు అందించిన జియోనీ గుర్తుందా? మంచి స్పెక్స్, డీసెంట్ కెమెరా, సూపర్ బ్యాటరీ బ్యాకప్‌తో జియోనీ |ఫోన్లు యూజర్లను బాగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు నోకియాలా ఫోన్లు కూడా చాలా గట్టిగా ఉండేవి. కాబట్టి ఎలాంటి యూజర్లకైనా బాగా ఉపయోగపడేవి. అలాంటి జియోనీ తన తోటి చైనా కంపెనీలు రియల్‌మీ, ఒప్పో లాంటి వాటితో పోటీపడలేక కొన్నాళ్లుగా నెమ్మదించేసింది. దాదాపు ఏడాదిగా కొత్త ఫోన్లే రిలీజ్ చేయలేదు. అయితే ఇప్పుడు మళ్లీ బడ్జెట్ |ఫోన్లకు గిరాకీ పెరుగుతుండటంతో ఏడాది రత్వాత మళ్లీ మార్కెట్లోకి వచ్చింది. జియోనీ మాక్స్ స్మార్ట్‌ఫోన్‌తో సైలెంట్‌గా రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ ఫోన్ ధర తక్కువ. ఫీచర్లు ఎక్కువగా ఉండటంతో మళ్లీ యూజర్ల నమ్మకం పొందే అవకాశాలున్నాయి.
ఇవీ జియోనీ మాక్స్ ఫీచర్లు
* 6.1అంగుళాల హెచ్‌డీ డిస్ ప్లే
* లేటెస్ట్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్
* ఆక్టా-కోర్ యునిసోక్ 9863ఏసాక్ చిప్‌సెట్
* 2 జీబీ ర్యామ్
* 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్. మెమరీ కార్డ్‌తో 256 జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు.
* 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా
* 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
* 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
ధర
జియోనీ మాక్స్ ఫోన్ బ్లాక్, రెడ్ , రాయల్ బ్లూ రంగుల్లో లభించనుంది. ధర రూ.5,999. ఆగస్టు 31 నుండి ఫ్లిప్‌కార్ట్ లో కొనుక్కోవచ్చు.
తక్కువ ధరలో మంచి |ఫోన్
6వేల లోపు ధరలో ఇలాంటి ఫీచర్లతో ఫోన్ మంచి ఆఫరే అని చెప్పాలి. ఇందులో 2జీబీ ర్యామ్ మాత్రమే ఉన్నా ఆక్టాకోర్ చిప్‌సెట్ ఉండటం, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఉండటంతో స్పీడ్‌లో పెద్ద తేడా ఏమీ ఉండదు. ఇక 5వేల ఎంఏహెచ్ బ్యాటరీ మంచి ఎసెట్. అంతేకాక జియోనీ |ఫోన్లు సాధార|ణంగా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. కెమెరా పనితనం కూడా బాగుంటుంది. కాబట్టి
ఆన్‌లైన్ క్లాస్‌ల కోసం పిల్లలకు ఫోన్ కొనాలనుకునేవారికి ఈ జియోనీ మ్యాక్స్ మంచి ఎంపికే అంటున్నారు మార్కెట్ నిపుణులు.