చైనీస్ మొబైల్ కంపెనీ ఒప్పో రెండు స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. ఒప్పో రెనో4, ఒప్పో రెనో 4 ప్రో పేరుతో ఈ రెండు మొబైల్స్‌ను చైనాలో రిలీజ్ చేసింది. ఈ నెల 18 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి. ఇండియాలో కూడా ఈ రెండు మోడల్స్‌ను త్వరలో రిలీజ్ కానున్నాయి. 8జీబీ ర్యామ్, సూపర్ పవర్ఫుల్ ప్రాసెసర్‌తో పాటు 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ ఫోన్లలో ప్రత్యేకతలు.
ఒప్పో రెనో 4
డిస్ప్లే: 6.4 ఇంచెస్ అమోల్డ్ కర్వ్డ్ ఫుల్ హెచ్డీ ప్లస్
ర్యామ్: 8జీబీ/ 12జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128/ 256 జీబీ
ప్రాసెసర్: ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 765 జీ ప్రాసెసర్
5జీ కనెక్టివిటీ
ఓఎస్: ఆండ్రాయిడ్ 10
ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సర్
గెలాక్టిక్ బ్లూ, స్పార్క్లింగ్ రెండ్, స్పేస్ బ్లాక్, స్పేస్ వైట్, గ్రీన్ గ్లిటర్ రంగుల్లో లభిస్తుంది.
బ్యాటరీ
4000 ఎంఏహెచ్, 65 వాట్స్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్
కెమెరాలు
ట్రిపుల్ రియర్ కెమరాలున్నాయి. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతోపాటు 12 మెగాపిక్సెల్, 13 మెగాపిక్సెల్ కెమెరాలున్నాయి. సెల్ఫీల కోసం ఫ్రంట్ 32, 2ఎంపీ కెమెరాలు ఇచ్చారు.
ధర
8జీబీ ర్యామ్/ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వెర్షన్ మన కరెన్సీలో రూ.32,000
8జీబీ ర్యామ్/ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వెర్షన్ మన కరెన్సీలో రూ.35,200
ఒప్పో రెనో 4 ప్రో
డిస్ప్లే: 6.5 ఇంచెస్ అమోల్డ్ కర్వ్డ్ ఫుల్ హెచ్డీ ప్లస్
ర్యామ్: 8జీబీ/ 12జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128/ 256 జీబీ
ప్రాసెసర్: ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 765 జీ ప్రాసెసర్
5జీ కనెక్టివిటీ
ఓఎస్: ఆండ్రాయిడ్ 10
ఫేస్ అన్‌లాక్, ఫింగర్‌ప్రింట్ సెన్సర్
గెలాక్టిక్ బ్లూ, స్పార్క్లింగ్ రెండ్, స్పేస్ బ్లాక్, స్పేస్ వైట్, గ్రీన్ గ్లిటర్ రంగుల్లో లభిస్తుంది.
బ్యాటరీ
4000 ఎంఏహెచ్, 65 వాట్స్ సూపర్ వూక్ ఫాస్ట్ ఛార్జింగ్
కెమెరాలు
నాలుగు రియర్ కెమరాలున్నాయి. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతోపాటు, 8ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్, 12 మెగాపిక్సెల్ సోనీ అల్ట్రా వైడ్ లెన్స్, 13 మెగాపిక్సెల్ టెలిఫోటో, ఆటోలేజర్ ఫోకస్ కెమెరాలున్నాయి. సెల్ఫీల కోసం ఫ్రంట్ 32 ఎంపీ కెమెరా ఇచ్చారు.
ధర
8జీబీ ర్యామ్/ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వెర్షన్ మన కరెన్సీలో రూ.40,500
8జీబీ ర్యామ్/ 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వెర్షన్ మన కరెన్సీలో రూ.45,800