షియోమి ప్రీమియం ఫోన్స్ బ్రాండ్ పోకో కొత్తగా ఎం2 ప్రో ఫోన్‌ను గతవారం ఇండియాలో లాంచ్ చేసింది. ఈ రోజు నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ఇంతకీ పోకో ఎం2 ప్రోలో ఫీచర్లేమిటి? రేటెంత? వివరాలు తెలుసుకోవడానికి ఈ ప్రివ్యూ చదవండి.
పోకో ఎం2 ప్రో ఫీచర్లు
* 6.67 ఇంచెస్ ఎల్సీడీ ప్యానల్ డిస్‌ప్లే
* ఫోన్ ముందు వెనుకా కూడా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
* స్నాప్‌డ్రాగన్ 720 జీబీ చిప్‌సెట్
* 4జీబీ / 6జీబీ ర్యామ్
* 64జీబీ / 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 11
* సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్
* బ్లూ, గ్రీన్, గ్రీనర్, బ్లాక్ కలర్స్‌లో దొరుకుతుంది.
కెమెరాలు
క్వాడ్‌కెమెరా సెటప్ ఉంది. 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్, 5 ఎంపీ మాక్రో సెన్సర్, 2 ఎంపీ డెప్త్ సెన్సర్‌తో వెనుకవైపు మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. సెల్ఫీల కోసం 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ
5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఇచ్చింది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది. కేవలం అరగంటలోనే 0 నుంచి 50% ఛార్జింగ్ అవుతుంది.
ధర
పోకో ఎం2 ప్రో 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 13, 999
పోకో ఎం2 ప్రో 6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 14, 999
పోకో ఎం2 ప్రో 6జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర 16, 999