ఒక పక్క కరోనా తెచ్చిన ఆర్థిక సంక్షోభంతో ప్రజల దగ్గర డబ్బుల్లేవు. మరోవైపు ఆన్‌లైన్ క్లాస్‌లని, ఇంకోటని స్మార్ట్ ఫోన్లు ప్రతి ఇంట్లోనూ ఒకటో రెండో కొనాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో బడ్జెట్ ఫోన్లకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. దీన్ని క్యాష్ చేసుకునేందుకు స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలన్నీ పోటీపడుతున్నాయి. తాజాగా రియల్‌మీ ఇదే దారిలో రెండు స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. రియల్‌మీ సీ12, రియల్‌మీ సీ15 పేరుతో విడుదలైన ఈఫోన్లు రెండూ 10వేల లోపు ధరలోనే ఉండటం విశేషం.
క్వాడ్రపుల్ కెమెరా సెటప్, భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ ఇలా మంచి మంచి ఫీచర్లన్నీ ఈ బడ్జెట్ ఫోన్లలో ఉండటంతో యూజర్లను ఆకట్టుకోగలమని రియల్‌మీ చెబుతోంది.
రియల్‌మీ సీ15
* 6.5 ఇంచెస్ మినీ-డ్రాప్ డిస్‌ప్లే విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సపోర్ట్
* ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో జీ 35 సాక్ ప్రాసెసర్
* 3జీబీ / 4జీబీ ర్యామ్
* 32జీబీ / 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
కెమెరాలు
బడ్జెట్ ఫోన్ అయినాగానీ నాలుగు కెమెరాల సెటప్‌తో రావడం విశేషం. వెనకవైపు 13 ఎంపీ మెయిన్ కెమరాతోపాటు 8, 2, 2 మెగాపిక్సెల్స్‌తో మరో మూడు కెమరాలున్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 8ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది.
భారీ బ్యాటరీ.. ఫాస్ట్ ఛార్జింగ్
ఈ ఫోన్‌లోఏకంగా 6,000 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీని అమర్చారు. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ దీనిలో మరో అట్రాక్షన్.
ధర
రియల్‌మీ 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999
4జీబీ, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ మోడల్ ధర రూ.10,999
ఆగస్టు 27 న ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ. కామ్‌లో సేల్ ప్రారంభమవుతుంది. తర్వాత ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు.
రియల్‌మి సీ12
* ఈ ఫోన్ 6.5అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో వచ్చింది.
* ఆక్టా-కోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్,
* 3జీబీ ర్యామ్
* 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
కెమెరాలు
మూడు కెమెరాల సెటప్‌తో వచ్చింది. వెనకవైపు 13 ఎంపీ మెయిన్ కెమరాతోపాటు 2, 2 మెగాపిక్సెల్స్‌తో మరో రెండు కెమరాలున్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది.
భారీ బ్యాటరీ.. ఫాస్ట్ ఛార్జింగ్
ఈ ఫోన్‌లో ఏకంగా 6,000 ఎంఏహెచ్ సామర్థ్యం ఉన్న బ్యాటరీని అమర్చారు. 10 వాట్స్ ఛార్జింగ్ ఫీచర్ దీనిలో మరో అట్రా|క్షన్ .
ధర
రియల్‌మి సీ 12 ధర రూ. 8,999. ఫ్లిప్‌కార్ట్, రియల్.కామ్‌లో ఆగస్టు 24న అమ్మకాలు మొదలవుతాయి